PBKS vs CSK IPL 2024 : ధర్మశాల వేదికగా సత్తా చాటిన చెన్నై...పంజాబ్ పై ఘనవిజయం...
అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 167 పరుగులు సాధించింది. అనంతరం 168 పరుగుల లక్ష్య చేధనతో బరిలో దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి కేవలం 139 పరుగులకే పరిమితమైంది. దీంతో 28 పరుగులు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ధర్మశాల వేదికగా ఘన విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్...
ఇక ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రూతురాజ్ గైక్వాడ్ 21 బంతుల్లో 32 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక అప్పటి నుండి చెన్నైకు బారి షాక్ తగులుతూ వచ్చింది. అనంతరం బరిలో దిగిన సిక్సర్ల శివమ్ దుబే సున్న పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా ఆ తరువాత కూడా చెన్నై వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నిలకడగా ఆడిన డారిల్ మిచెల్ కూడా 30 పరుగుల వద్ద అయ్యాడు.
అనంతరం జడేజా , మొయిన్ అలీ , ధోని వరుసగా పెవిలియన్ చేరడంతో చెన్నై అభిమానులు నిరాశ పడ్డారు. దీంతో నిర్దేశిత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేయగలిగింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వస్తే రాహుల్ చాహార్ 3 వికెట్లు అర్షల్ పటేల్ 3 వికెట్లు తీసుకున్నారు. వీరితోపాటు అర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
పంజాబ్ ఇన్నింగ్స్...
అనంతరం 168 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. 9 పరుగుల వద్ద బట్లర్ అవుట్ కాగా అదే ఓవర్ లో మరో వికెట్ పడడంతో పంజాబ్ నిరాశ చెందింది. దీంతో 9 పరుగులకే పంజాబ్ 2 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన శశాంక్ సింగ్ , ప్రభు సిమ్రాన్ సింగ్ నిలకడగా ఆడటంతో పవర్ ప్లే మూగిసేసరికి పంజాబ్ 2 వికెట్లు నష్టపోయి 47 పరుగులు చేయగలిగింది.
ఇక ఆ తర్వాత సిమ్రాన్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం వరుసగా వికెట్లు కోల్పోయిన పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడిపోయింది. దీంతో 10 ఓవర్లకు పంజాబ్ 5 వికెట్లు నష్టపోయే 72 పరుగులు చేయగా , 13వ ఓవర్ లో 2 వికెట్లు పడ్డాయి. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన పంజాబ్ 139 పరుగులకే పరిమితమైంది. దీంతో ధర్మశాల వేదికగా చెన్నై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.