Priyansh arya : ఆర్‌సీబీకి ట్రోఫీ అందిస్తా.. డీపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సులు కొట్టిన కుర్రాడు
ఈ ప్రియాంష్ ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగానే ఆరు బంతులకు ఆరు సిక్స్ లు కొట్టి అందరి దృష్టిని తన వైపుకు మళ్లించుకున్నాడు. కేవలం ఈ ఘనతతో ఆగిపోకుండా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో రెండు సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్గా ఈ ప్రియాంష్ ఆర్య నిలిచాడు. ఇలా ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ఈ ప్లేయర్ ఈమధ్య జరిగినటువంటి ఇంటర్వ్యూలలో కూడా తన భావాన్ని వెల్లడించాడు.
సాధారణంగా మన భారతదేశంలో జరిగే ఒకే ఒక క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఈ ఐపీఎల్లో ఆడాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఈ సమయంలోనే ప్రియంష్ ఆర్యా తన మనసులోని కోరికను బయటపెట్టాడు. వచ్చే సంవత్సరం మెగా వేలం ఉండడంతో నేను కూడా ఐపీఎల్ లో ఆడాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ ప్రియంష్ ఆర్య ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టడంతో కేవలం క్రికెటర్లనే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీస్ యాజమాన్యాల చేతిలో కూడా పడ్డాడు. ఈ యువ క్రికెటర్ ను తమ టీమ్ లోకి తీసుకోవాలని ఐపిఎల్ యాజమాన్యాలు అనుకుంటున్నాయి. ఈ యు క్రికెటర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అద్భుతమైన ఆటతీరుతో కొన్ని కొత్త రికార్డులను సృష్టిస్తూ వస్తున్నాడు. ఈ ప్లేయర్ ఏకంగా ఐపీఎల్ లో భారీ ధరనె పలుకుతాడని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ యువ క్రికెటర్ ప్రియాంష్ ఆర్య నేను బెంగళూరుకి ఆడాలని చెప్పేసి ముందుగానే ఇంటర్వ్యూలకు తన మనసులోని మాట చెప్పేసాడు.
మరి తను కోరుకున్న ఆర్ సి బి టీం యాజమాన్యాలు తనని తీసుకుంటాయో లేదో మనం వేచి చూడాల్సిందే. ఏదైనా సరే ఇలాంటి రికార్డులు సృష్టించిన ప్లేయర్ని ఎవరూ కూడా వదులుకోరు కాబట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీం కచ్చితంగా ఈ యువ క్రికెటర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి ఇంతలా రికార్డులు సృష్టించిన ఈ ప్లేయర్ని మరి నీ ఐపిఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ టీం తరఫున ఆడుతున్న ప్రియాంష్ ఆర్య ఎన్నో ఘనతలను సాధిస్తున్నాడు. ప్రస్తుతం అతను కేవలం 9 మ్యాచ్లలోనే 902 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు మరియు నాలుగు అర్ద సెంచరీలు ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఎడమ చేతి యువ బ్యాటర్ ఈ లీక్స్లలో తుఫాన్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ గా పేరు పొందాడు.
ఈ ప్లేయర్ రాబోయే ఐపీఎల్ లీగ్ లో ఆర్ సి బి తరుపున ఆడాలనే తన కోరికను బయటకు వ్యక్తం చేశాడు. ఈమధ్య ఓ వెబ్సైట్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం ఆ ఇంటర్వ్యూలో ప్రియాంష్ ఆర్య మాట్లాడుతూ " నా ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ".. కాబట్టి నేను ఆర్సిబి తరఫున ఆడాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం నాకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని అన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకోలేదు. కాబట్టి దాన్ని అధిగమించాలని నేను కోరుకుంటున్నాను. ఐపీఎల్ లో ఈ టీం తరఫున ఆడి నా బ్యాటింగ్ను కూడా జట్టుకి భాగస్వామిగా ముందుకు తీసుకెళ్తానని, ఆ నమ్మకం నాకు ఉందని తద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని చెప్పి ప్రియంష్ ఆర్య ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ యువ ప్లేయర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో సంచలనం సృష్టిస్తూ ఉన్నాడు. ఈ ప్రియంశార్య క్రికెటర్ ఈసారి ఐపీఎల్ లో కనిపించడం కాయమే అని అందరూ చెబుతున్నారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అయినా ఈ యువ క్రికెటర్ పై ఇప్పటికే కొన్ని ఐపిఎల్ ఫ్రాంచైజీస్ కన్నేసాయి.
మరి తన మనసులోని కోరికను అదే ఐపీఎల్ లో ఆర్సిబి తరఫున ఆడాలని కోరికను ఆర్సీబీ ఫ్రాంచైజీ తనణు కొనుగోలు చేసి తన కోరికను నెరవేరుస్తుందో వేచి చూడాల్సిందే. అన్ని టీంలు ఇప్పటికే తన టీం లో ఎవరిని రేటింగ్ చేసుకోవాలి ఎవరిని వదులుకోవాలని ఆలోచనలు మొదలయ్యాయి. మరి ఈ ప్లేయర్ ఐపిఎల్ లోకి అడుగు పెట్టాలంటే మెగా వేలం దాకా ఆగాల్సిందే.