SRH Vs CSK IPL 2024 : చేజింగ్ లో మరోసారి సన్ రైజర్స్ విఫలం.. చపాక్ వేదికగా చెన్నై ఘనవిజయం...
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేయగలిగింది. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో కేవలం 134 పురుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో చేధనలో సన్రైజర్స్ రెండో ఓటమి చవిచూసింది.
చెన్నై ఇన్నింగ్స్...
ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసేందుకు తోలుత గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట అంతగా ఆకట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే 19 పరుగుల వద్ద చెన్నై ఒక వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఓపెనర్ గా వచ్చిన అజీంకా రహానే 12 బంతుల్లో ఒక బౌండరీ సాధించి 9 పరుగులకే పేవిలియన్ బాట పట్టాడు.

అనంతరం బరిలో దిగిన డారిల్ మిచెల్ మరో వికెట్ కోల్పోకుండా రూతురాజ్ భాగస్వామ్యంలో 100 పరుగులు సాధించారు. ఈ విధంగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డారిల్ మిచెల్ కుదురుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో అర్థ శతకాన్ని పూర్తి చేసుకోగా, 29 బంతుల్లో డారిల్ మిచేల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
ఈ నేపథ్యంలోనే 134 పరుగుల వద్ద చెన్నై మరో వికెట్ సమర్పించుకుంది. 32 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్స్ తో మిచెల్ 52 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం రుతురాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడుతూ 54 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్స్ లతో 98 పరుగులు చేసి సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. దీంతో 200 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్ ను కోల్పోయింది.
ఇక ఎప్పటిలాగే సిక్సర్ల దూబే చివర్లో మెరుపులు మెరిపించగా 20 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. అనంతరం చివరి ఓవర్ లో మైదానంలోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని 2 బంతుల్లో 5 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది. ఇక హైదరాబాద్ బౌలర్ల విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్ ఒకటి, జయదేవ్ ఉనద్కత్ ఒకటి నటరాజన్ ఒక వికెట్ పడగొట్టారు.
హైదరాబాద్ ఇన్నింగ్స్...
అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ షెడ్ అభిషేక్ శర్మ స్వల్ప పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా , ఎవరు కూడా స్కోర్ ని ముందుకు తీసుకెళ్లలేక పోయారు. ఈ క్రమంలోనే మార్కమ్ 26 బంతుల్లో నాలుగు బౌండరీలు సాధించి 32 పరుగులు చేయగా క్లాసన్ 21 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే సాధించి ఆల్ అవుట్ అయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల భారీ తేడాతో హోమ్ గ్రౌండ్ వేదికగా ఘన విజయం సాధించింది. ఇక చెన్నై బౌలర్ల విషయానికొస్తే తుషార్ దేశ్ పాండే 4 వికెట్లు పడగొట్టగా, పతిరాన మరియు ముస్తాఫిజర్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. జడేజా మరియు శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ తీసుకున్నారు.