SRH vs CSK IPL 2024 : సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం
శివం దూబే 45 పరుగులు అత్యధిక స్కోరు కావడం గమనార్హం. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 166 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసింది. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తెలుగు రాష్ట్రానికి చెందిన యంగ్ స్టర్ నితీష్ కుమార్ రెడ్డి సిక్సర్‌తో చెలరేగి ఆటను ముగించేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపినర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర 9 బంతులకి 12 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా, CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 21 బంతులకు 3 ఫోర్లు 1 సిక్స్ తో 26 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బరిలో దిగిన రహానే 30 బంతుల్లో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించగా, వరుస సిక్స్ లతో ధూబే ప్రత్యర్థ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ నేపథ్యంలోనే 24 బంతుల్లో 4 సిక్సులు 2 ఫోర్ లతో శివమ్ దూబే 45 పరుగులు చేసి SRH కెప్టెన్ ఫాట్ కమ్మిన్స్ కు వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం బరిలో దిగిన రవీంద్ర జడేజా 23 బంతుల్లో 4 ఫోర్ లతో 31 పరుగులు చేయగా, డి మిచెల్ 11 బంతుల్లో 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో మరో మూడు బంతులు మిగిలి ఉండగా బరిలో దిగిన మహేంద్ర సింగ్ ధోని 2 బంతులకు 1 పరుగు చేసి ఇన్నింగ్స్ ను పూర్తి చేశారు. దీంతో 5 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది.
ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ రెండింటిలో విజయాన్ని సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా అత్యంత ప్రతిభా గల ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్ వంటి కీలక టీమ్‌లను చిత్తుగా ఓడించడం గమనార్హం.