SRH Vs LSG IPL 2024 : చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ హిస్టరీలో ఇదే తొలిసారి..
ఐపీల్ హిస్టరీలో కేవలం 58 బంతుల్లో 166 పరుగుల లక్ష్యాన్ని చేదించిన మొదటి జట్టుగా చరిత్రకెక్కింది. హైదరాబాద్ జట్టుకు చాలా కీలకమైన ఈ మ్యాచ్ లో బౌలర్స్ కూడా విజృంభించడంతో హోమ్ గ్రౌండ్ వేదికగా హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఫోర్లు సిక్స్ లతో చెలరేగడంతో లక్నో బౌలర్లు కట్టడి చేయలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్ లతో 89 పరుగులు చేయగా, 28 బంతుల్లో అభిషేక్ శర్మ 8 ఫోర్లు 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి జట్టుకు భారీ విజయం అందించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 62 బంతులు మిగిలి ఉండగానే 166 పరుగుల లక్ష్యాన్ని చేదించి ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

లక్నో ఇన్నింగ్స్...
భువనేశ్వర్ కుమార్ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నితీష్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో లక్నో ఓపెనర్ క్వింటన్ డీకాక్ అవుట్ అయ్యాడు. డీ కాక్ కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించి పెవిలియన్ చేరాడు. దీంతో 13 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ ను కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కేవలం మూడు పరుగులు సాధించిన స్టోయినిస్ కూడా పెవిలియన్ చేరాడు.
దీంతో 27 పరుగులకే లక్నో 2 వికెట్లు కోల్పోయింది. లక్నో బట్టర్స్ ను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో లక్నో పవర్ ప్లే ముగిసేసరికి రెండు వికెట్లు నష్టపోయి 27 పరుగులు మాత్రమే సాధించగలిగింది. అనంతరం 10వ ఓవర్ లో 29 పరుగులు సాధించిన కెప్టెన్ కే ఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు.
ఇక తర్వాత కృణాలు పాండ్యా కూడా అవుట్ అవ్వడంతో లక్నో మరింత కష్టాల్లో పడింది. అనంతరం బరిలో దిగిన నికోలస్ పూరన్ నిలకడగా ఆడడంతో లక్నోకు కాస్త పరుగులు వచ్చాయి.ఈ నేపథ్యంలోని పూరన్ 26 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్ తో 48 పరుగులు చేసి అజేయుడుగా నిలిచాడు. అతనితోపాటు ఆయుష్ బదోని 30 బంతుల్లో 9 ఫోర్లు సాధించి 55 పరుగులు చేశాడు.
దీంతో నిర్దేశిత 20 ఓవర్లలో లక్నో 4 వికెట్లను కోల్పోయి 165 పరుగులను సాధించింది. ఇక సన్ రైజర్స్ బౌలర్ల విషయానికొస్తే 4 ఓవర్లు బౌలింగ్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం 12 పరుగులు మాత్రమే అందించి ఏకంగా రెండు వికెట్లను పడగొట్టారు.
చితక్కొట్టిన సన్రైజర్స్ ....
అనంతరం 166 పరుగుల లక్షంతో బరిలో దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో ఇచ్చిన ఈ లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ ఓపెనర్లుగా దిగిన ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ వర్మ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించారు.
ప్రతి బంతిని బౌండరీలకు తరలిస్తూ లక్నో బౌలర్ల పతనాన్ని శాసించారు. ఈ క్రమంలోనే ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 8 ఫోర్లు 8 సిక్స్ లతో 89 పరుగులు చేయగా , అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు 6 సిక్స్ లతో 75 పరుగులు సాధించాడు. దీంతో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో 9.4 ఓవర్ లోనే మ్యాచ్ ముగించి హోమ్ గ్రౌండ్ వేదికగా ఘనవిజయం సాధించింది.