MI vs SRH IPL 2024 : 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై సన్ రైజర్స్ గెలుపు
కానీ పాట్ కమిన్స్ కెప్టెన్సీగా రావడంతో ఈసారి ఆటలో మార్పు వచ్చిందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 17 సీజన్‌లు ఆడిన ఐపీఎల్ హిస్టరీలో ఏ మ్యాచ్‌లోనూ చేయని స్కోరు 277 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయాన్ని సాధించింది.
గతంలో 2013 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అత్యధికంగా 263 పరుగులు చేసింది. మొత్తం 17 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలోనే ఇంత పెద్ద స్కోరు నమోదు కావడం క్రికెట్ అభిమానులు నమ్మలేకపోతున్న నిజం. క్లాసన్ 34 బంతుల్లో 80 పరుగులు (నాటౌట్) చేసి ముంబై ఇండియన్ బౌలర్లను ఊచకోత కోశాడు.
సన్ రైజర్స్ కెప్టెన్ మక్రం 28 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పవర్ ప్లే లో హేడ్ 24 బంతుల్లో 62 పరుగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 64 పరుగులు చేసి మ్యాచ్‌కి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లోనూ ఐపీఎల్ చరిత్రలో 6 ఓవర్లకు 80 పరుగులు చేసి రికార్డును నమోదు చేశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు నష్టపోయి 246 మాత్రమే పరుగులు చేసింది. 31 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్‌రైజర్స్ విజయం సాధించింది.
ఒక దశలో మ్యాచ్ సన్ రైజర్స్ నుంచి చేజారి పోతుందనిపించింది. తిలక్ వర్మ 64 పరుగులు, టిమ్ డేవిడ్ 42 పరుగులు చేశాడు. తొలిసారిగా ఐపీఎల్ చరిత్రలో 500లకు పైగా పరుగులు చేసిన మ్యాచ్ కావడం గమనార్హం.