Cricketers: 90 నుంచి 99 పరుగుల మధ్య ఎక్కువసార్లు అవుట్ అయిన క్రికెటర్లు వీరే..
అయితే ఎంతోమందికి తెలియనటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సాధారణంగా ఒక ప్లేయర్ సెంచరీ చేయాలంటే చాలా కష్టపడాలి. ప్రతి బాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి ఆడాలి. అలా దాదాపు చాలామంది క్రికెట్ లో 90 పరుగుల నుండి 99 పరుగుల మధ్య చాలామంది ఎన్నోసార్లు అవుట్ అయ్యారు . ఇందులో ఏకంగా విదేశీయులే కాకుండా భారతీయులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కువసార్లు 90 నుంచి 99 పరుగుల మధ్య అవుట్ అయిన వారి గురించి మనం తెలుసుకుందాం.
సచిన్ టెండుల్కర్
రాహుల్ ద్రావిడ్
రాహుల్ ద్రావిడ్ క్రికెట్ లో ఎన్నో గొప్ప విజయాలను కూడా భారతదేశానికి అందించాడు. రాహుల్ ద్రావిడ్ యొక్క బ్యాటింగ్ సాహసం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి రాహుల్ ద్రావిడ్ కూడా 90 పరుగుల వద్ద దాదాపుగా 14 సార్లు అవుట్ అయ్యి ప్రేక్షకులకి నిరాశ అందించాడు.
ఎబి డివిలియర్స్
ఎబి డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బ్యాట్స్మెన్. ఇతను సౌత్ ఆఫ్రికా తరఫున ఎన్నో రికార్డులు కూడా సృష్టించాడు. ఒంటిచేత్తో మ్యాచ్ మొత్తాన్ని తిప్పగల సాహస వ్యక్తి. ఇలాంటి ఎంతో పేరుగాంచిన ఎబి డివిలియర్స్ కూడా దాదాపుగా 14 సార్లు 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ టీం లో అత్యుత్తమ బ్యాటర్ కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ కెప్టెన్ గా కూడా చేసిన అనుభవం ఉన్న ఈ కెన్ విలియమ్స్ అండ్ దాదాపుగా 14 సార్లు 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెన్ విలియమ్స్ అండ్ దాదాపుగా 480 ఇన్నింగ్స్ లో 14 సార్లు అవుట్ అయ్యాడు.
రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మెన్ రికీ పాంటింగ్. కోచ్గా ఇప్పటికి కూడా చాలా మ్యాచ్లను గెలిపిస్తూ ఉన్నాడు. ఇతని బ్యాటింగ్ అందరిని మైమరిపించేలా ఆడుతాడు. ఆస్ట్రేలియా తరపునఎన్నో మ్యాచ్ లడి దేశానికి ఎన్నో విజయాలను అందించాడు. రికీ పాంటింగ్ ఇప్పటివరకు 13 సార్లు 90 పరుగులు వద్ద అవుట్ అయ్యాడు.
ఇంజమామ్-ఉల్-హక్
పాకిస్తాన్ క్రికెట్ టీం తరఫున అత్యుత్తమ బ్యాట్స్మెన్ ఇంజమామ్ ఉల్ హక్. పాకిస్తాన్ టీం తరఫున గొప్ప బ్యాట్స్ మెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఇతనే. ఇతను కూడా దాదాపుగా 12సార్లు 90 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇతను మొదటిగా మ్యాచ్లో చిన్నగా ప్రారంభించిన చివరి తరంలో సెంచరీ చేయకుండానే వెను తిరుగుతుంటాడు. కాబట్టి ఇలా ఎన్నో మ్యాచ్లు 90 పరుగులు చేసి జట్టు విజయాల్లో ముఖ్య పాత్ర పోషించాడు.
ఇలా ఇలాంటి దిగ్గజ బ్యాట్స్మెన్లు కూడా చాలాసార్లు 90 పరుగుల వద్ద అవుట్ అవుతున్నారు. ఒక ప్లేయర్ మ్యాచ్ ప్రారంభించడంలో మొదటగా నెమ్మదిగా ఆడుతూ సెంచరీ చేయాలనే తపనతో ఒత్తిడికి గురై అక్కడ అవుట్ అవుతూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో చాలామంది క్రికెటర్లు చాలా బాధ కూడా పడుంటారు. ఇలాంటి వాళ్లలో మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే మన ఇండియా తరఫున సచిన్ టెండూల్కర్ అర్థ సెంచరీలు అలాగే సెంచరీలు చేసి ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.