Cricket : భారత స్టార్ ఆటగాళ్లకు ఏమైంది?
నేడు మధ్యాహ్నం కొత్త జట్టు ఎంపిక
Cricket : న్యూఢిల్లీ : భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టులకు గాను భారత్ స్టార్ ఆటగాళ్లు దూరమవుతున్న తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరొకటి విజయం సాధించి సిరీస్ ను సమంతో కొనసాగుతోంది. కాగా ఈ రెండు మ్యాచ్‌లకే భారత స్టార్ ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. ఇక మిగతా మ్యాచ్‌ల గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు టెస్ట్ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో సీనియర్లు ఆడుతారా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లకు వివిధ కారణాలతో ఆటకు దూరమయ్యారు.
కాగా వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్ కూడా మిగతా మూడు మ్యాచ్ లకు ఆడే ఛాన్స్ కనిపించడం లేదు. అతను ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ పెద్దగా రాణించకపోవడం వల్ల అతనిపై వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆదివారం మధ్యాహ్నం ఎంపిక చేసే కొత్త జట్టులో ఎవరెవరు ఆడుతారో తెలుస్తోంది. ఈనెల 15 నుంచి మూడో టెస్టు రాజ్‌కోట్‌లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెలెక్టర్లు ఆటగాళ్ల ఎంపికలో తలమునకలయ్యారు.