Yashasvi Jaiswal : శతకంతో చెలరేగిన యశస్వి జైష్వాల్... టేబుల్ టాపర్ గా రాజస్థాన్
అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ ఈ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో 8 బాల్స్ మిగిలి ఉండగానే ముగించింది. హోమ్ గ్రౌండ్ వేదికగా రాజస్థాన్ బ్యాటర్స్ విజృంభించి ఆడడంతో ముంబై ఖాతాలో మరో ఓటమి చేరక తప్పలేదు. ఈ నేపథ్యంలోనే వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా ఉన్న రాజస్థాన్ మరో విజయంతో ఆ స్థానాన్ని కొనసాగిస్తుంది.
ముంబై పతనం...
ఈ భారీ దెబ్బ నుండి కోలుకొక ముందే ముంబై ఇండియన్స్ కు మరొ గట్టి షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ 3 బంతుల్లో 0 పరుగులు చేసి డక్ ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ను రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ అవుట్ చేసి రాజస్థాన్ కు మరో వికెట్ అందించాడు. దీంతో ఇషాన్ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవీలియన్ చేరాడు. దీంతో ముంబై ఇండియన్స్ కేవలం 6 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.
అనంతరం 2 బౌండరీలు సాధించి మంచి ఫామ్ కనబరిచిన సూర్య కుమార్ యాదవ్ కూడా రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మకు వికెట్ ఇవ్వక తప్పలేదు. దీంతో సూర్య కుమార్ యాదవ్ 8 బంతుల్లో 2 ఫోర్ల తో 10 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ముంబై ఇండియన్స్ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో మునిగిపోయింది.
అనంతరం యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్ లతో 65 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేయగా రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ చేతిలో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత నబి 17 బంతుల్లో 23 పరుగులు, నేహళ్ వాధెరా 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్ లతో 49 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
అనంతరం బరిలో దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 10 పరుగులు చేసే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్, కట్ జీ, చావ్లా ,బుమ్రా, స్వల్ప పరుగులు చేసి రాజస్థాన్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో నిర్దేశిత 20వ ఓవర్లలో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేయగలిగింది.
సెంచరీ తో చెలరేగిన యశస్వి జైస్వాల్...
180 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ వేదికగా విజృంభించి ఆడింది. ఈ నేపథ్యంలోనే 180 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ బ్యాటర్లను ముంబై బౌలర్లు కట్టడి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు.
ఈ క్రమంలోనే ముంబై బౌలర్ పియూష్ చావ్లా ఒక్కడే ఒక వికెట్ తీయగా మిగతా బౌలర్లు వికెట్లు తీయకుండా అధిక పరుగులు ఇవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ మధ్యలో వర్షం పడడంతో స్ట్రాటజీక్ టైం లో ఎంపైర్లు కాసేపు మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికే రాజస్థాన్ స్కోర్ 61 గా ఉంది. వర్షం ఆగిన అనంతరం తిరిగి మ్యాచ్ ను మొదలుపెట్టారు.
దీంతో రాజస్థాన్ యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 60 బంతుల్లో 7 సిక్సులు 6 ఫోర్ లతో 104 పరుగులు సాధించి అజేయుడుగా నిలిచాడు. అలాగే జాష్ బట్లర్ 25 బంతుల్లో 6 బౌండరీలు సాధించి 35 పరుగులు చేయగా, రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ 28 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సులతో 38 పరుగులు చేసి ఘన విజయం సాధించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి183 పరుగులు చేసి హోమ్ గ్రౌండ్ వేదికగా ఘన విజయం సాధించింది.