Komati Reddy Venkat Reddy: రైస్ మిల్లర్లకు మంత్రి హెచ్చరిక.. మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులు సీజ్
మిర్యాలగూడలో యాజమాన్యాకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
On
బుధవారం మిర్యాలగూడలో మంత్రి పలు దేవాలయాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రైస్ మిల్లుల వద్ద ఆగి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.
సన్న బియ్యం ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న మిల్లర్లు సన్న వరి ధాన్యానికి ఎందుకు మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే రైస్ మిల్లులు సీజ్ చేయడం ఖాయమని హెచ్చరించారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
