బంగారు నంది అవార్డు పుర‌స్కారం అందుకున్న బొంగర్ల శ్రీనివాస్

బంగారు నంది అవార్డు పుర‌స్కారం అందుకున్న బొంగర్ల శ్రీనివాస్

మిర్యాలగూడ, ఏప్రిల్ 14 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన బొంగర్ల శ్రీనివాస్ కి అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ  ప్రభుత్యం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి నందు ఆదివారం గద్దర్ కూతురు వెన్నెలక్క, జూపాల కృష్ణారావు, డాక్టర్ శ్రీనివాసరాజు చేతులమీదుగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ బొంగర్ల శ్రీనివాస్ కు నంది అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు  జీవితకాలం రుణపడి ఉంటా, 25 సంవత్సరాల పైగా నేను ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నాను. జీవితంలో ఎన్నో కష్టాలు,  ఒడిదుకు ఎదుర్కొని పైకి వచ్చిన వ్యక్తిని, అంచలంచెలుగా ఎదుగుతూ నేటికీ కొన్నివేల శుభ కార్యాలను చిత్రీకరించడం జరిగింది. నా ఫోటోగ్రాఫర్ ప్రతిభను గుర్తించి నంది అవార్డు అందజేయడం. అదేవిధంగా ఈ రోజు నా జీవితంలో మరువలేని రోజు, ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ నా అవార్డ్ నా కస్టమర్ దేవుళ్ళకే అంకితం. ఎందుకు అంటే నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా కస్టమర్లే, అందుకే నా కస్టమర్ దేవుళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వల్లూరి ఫౌండేషన్ అధినేత శ్రీనివాస రాజు, వెన్నెల, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ దైవజ్ఞ శర్మ, డాక్టర్ పద్మిని దేవి, రామకృష్ణ గౌడ్, ఫిల్మ్ ఛాంబర్   ఆఫ్ కమిటీ తదితరులు పాల్గొనడం జరిగింది.

IMG-20250414-WA0108

Read Also ఇంటర్ మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించిన కుమ్మరి వంశీ..అభినందించిన ఎమ్మెల్యే

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?