మిర్యాలగూడ, మే 01 :- మే డే స్ఫూర్తితో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలుచేసిన పారిశ్రామిక విధానమే యావత్ ప్రపంచానికి దిక్సూచిగా మారిందని మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక లోకానికి ఆయన మే డే శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని హనుమాన్ పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైస్ మిల్లర్స్, డ్రైవర్స్ అసోసియేషన్, మినీ డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుందని అన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టించబడిందన్నారు. తద్వారా దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. కార్మికులంతా సంఘటితంగా ఉండి శ్రమశక్తిని ఎలుగెత్తి చాటాలని ఆయన ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు శ్రామికుల కుటుంబాల్లో వెలుగులు నింపాయని భాస్కర్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, జొన్నలగడ్డ రంగా రెడ్డి, ఎండీ మగ్దూమ్ పాషా, ఇలియాస్ ఖాన్, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, పిసికే ప్రసాద్, కార్మిక విభాగం నాయకులు దుండిగల అంజయ్య, అయిల వెంకన్న, పట్టేం శ్రీనివాస రావు, అంగోతు హాతీరాం నాయక్, మట్టపల్లి సైదయ్య యాదవ్, పునాటి లక్ష్మీనారాయణ, పేరాల కృపాకర్ రావు, షోయబ్, పెండ్యాల పద్మ, తిరుపతయ్య గౌడ్, ధనావత్ ప్రకాష్ నాయక్, అసిమ్, మాచర్ల అంజయ్య, అంజన్ రాజు, మేగ్య శ్రీను, గయాస్, రామావతారం, ఖాజా, బీమ్ల నాయక్, చిమట మల్లయ్య యాదవ్, బాబా, సాయి, ఫయాజ్, గంగుల బిక్షం, పట్టాభి, యాదగిరి, చలికంటి యాదగిరి, మాలవత్ రవీందర్ నాయక్, జానకి రెడ్డి, గురకులాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోతు సురేష్ నాయక్, ధనమ్మ, ఉమా, నాంపల్లి యేసు తదితరులు పాల్గొన్నారు.
