Gundala : గుండాల, క్విక్ టుడే : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తుర్కల శాపురం గ్రామంలో గురువారం దళితవాడలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో కులాల వివక్షత చూపకుండా చేసిన రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన చట్టాలు అమల్లో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కులాలవారీగా, మతాలవారీగా తేడాలు ఉన్నట్లయితే కుల బహిష్కరణ చట్ట వ్యతిరేక కార్యక్రమం, దళిత వ్యతిరేక కార్యక్రమాలు, వారి హక్కులను రాజ్యాంగ బద్దంగా పొందపరిచిన చట్టాలను ఉద్దేశపూర్వకంగా నష్టం చే కూర్చే వారిపై కేసులు నమోదు చేసి విచారణ ఆధారంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు.

దళితులు ప్రతి చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై యాకన్న, ఎఎస్ఐ ఇంద్రపల్లి ప్రకాష్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమణారెడ్డి, కార్యదర్శి రామ్ నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.