తొర్రూర్ మే 30(క్విక్ టుడే న్యూస్):- పాలకుర్తి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి పూనుకునే సంకల్పంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్‌ను మంజూరు చేయడం గర్వకారణంగా, ప్రగతికి నిదర్శనంగా నిలిచిందని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డిలు అన్నారు.

ఈ సందర్భంగా, వారు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు, నియోజకవర్గ ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విద్యా సదుపాయం స్థానిక విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తును అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అదనంగా, వారు సీఎం ఈ నిర్ణయం ద్వారా పాలకుర్తి ప్రాంతానికి వచ్చే విద్యా ప్రగతిని వివరించి, త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ఇంచార్జ్ స్థానికులు అభినందనలు తెలియజేశారు..