ఈదురు గాలులు, వడగండ్లతో పంట నష్టం – ఆందోళనలో రైతులు

ఈదురు గాలులు, వడగండ్లతో పంట నష్టం – ఆందోళనలో రైతులు

శివ్వంపేట ఏప్రిల్ 17 (క్విక్ టు డే న్యూస్):- మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షంలో భారీ సైజులో ఉండే వడగండ్ల రాళ్లు కురవడంతో కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలలో వరి పంటలు నేలకు ఒరుగగా, మరి కొన్ని గ్రామాల్లో వడగండ్లతో వడ్లు నేల రాలి, టమాట పంటలు తదితర ఆరు తడి పంటలు దెబ్బతిన్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి, పండించి పంట చేతికి వచ్చే దశలో కండ్ల ముందే వడగండ్ల వర్షం కురిసి వడ్లు నేల రాలడంతో మండల పరిధిలోని కొత్తపేట, పిల్లుట్ల, రత్నాపూర్, అల్లిపూర్ గ్రామాల రైతన్నలు ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం కలిగింది. ప్రభుత్వం స్పందించి, వ్యవసాయ అధికారులను క్షేత్రస్థాయికి పంపించి పంట నష్టం పై విచారణ జరిపి వర్షంతో పంట నష్టం జరిగిన రైతన్నలను ఆదుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు కోరారు.

IMG-20250417-WA0061

Read Also నూతన వధూవరులను ఆశీర్వదించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?