మేడిపల్లి, మే 8 (క్విక్ టుడే న్యూస్):-లయన్స్ క్లబ్ అఫ్ మేడిపల్లి అధ్యక్షులు వేముల కేశవ నాదం గౌడ్ అధ్యక్షతన పీ అండ్ టీ కాలనీకి చెందిన తల్లం చంద్రమౌళి తన కుమారుడు ప్రణవ్ సాయి జన్మదిన సందర్భంగా డిలైట్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ గ్రేసీ మేడిపల్లి వారికి, క్వింటాల్ రైస్, నిత్యావసర సరుకులు, మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మన తల్లం చంద్రమౌళి సేటు గారికి మన లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు వారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పల్లె బాలరాజు గౌడ్, లయన్ మహేందర్ రావు, లయన్ శారద, లయన్ సావిత్రి, లయన్ రవీందర్ రెడ్డి, లయన్ ప్రభాకర్, లయన్ సందీప్, క్రిష్ణస్వామి, ఫౌండేషన్ యజమాన్యం సభ్యులు పాల్గొన్నారు.
