ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ
తొర్రూరు మండలం చర్లపాలెం, హరిపిరాల, తదితర కేంద్రాల నుండి జిల్లా సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్,
మరిపెడ క్లస్టర్ నుండి డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి,
ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తూ ఎప్పటికప్పుడు కేంద్రాల నిర్వహణ రవాణా చేయు సందర్భంలో సమన్వయం చేస్తూ ఉన్నారు,
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా సిబ్బందిని టెలిఫోన్ సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో ధాన్యాన్ని తరలించడం కోసం ప్రత్యేక కార్యచరణ చేపట్టారు,
కాంట్రాక్టర్స్, హమాలీలు, రైతులతో సంబంధిత అధికారులు సమన్వయం చేస్తూ జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తరలించడం జరుగుతుంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్స్ గన్ని, సంచులు, తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని,
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేసి,
పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తుంది.
సహకార శాఖ, సివిల్ సప్లై, వ్యవసాయ, హార్టికల్చర్, ఐకెపి , ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు సంబంధిత సిబ్బంది రైతులతో స్నేహపూర్వకంగా ఉంటూ కొనుగోళ్లు చేస్తున్నారు.