గుండ్లపల్లిలో ధాన్యం గోల్‌మాల్ – సీఓ భర్త పై ఆరోపణలు

పెట్టి, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొందరు దొంగ పనులు చేస్తూ, రైతుల కష్టాన్ని స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం పని చేయాల్సిన ఐకెపి అధికారులు దొంగ దందాలకు శ్రీకారం చుట్టడం పై మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని గుండ్లపల్లి లో ఐకెపి సీఓ చంద్రకళ భర్త బోళ్ల సదానందం రైతులకు సంబందించిన 9 క్వింటాళ్ల 30 కిలోల ధాన్యాన్ని గోల్ మాల్ చేశారని రైతులు నిలదీయడంతో తిరిగి వారికి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు ఒగ్గు సురేష్, పెంజర్ల మహేష్, పెంజర్ల శ్రీనివాస్, ఎండి ఖాదర్ పాషా, గొర్రె విష్ణువర్ధన్ రెడ్డి, పెంజర్ల నరసింహ, ఎర్ర పోచయ్య, అగ్రహారం నరసింహ, ఉప్పు నూతల మహేష్, పెంజర్ల మల్లేష్,పి మమత ల నుంచి కొనుగోలు చేసిన వరిధాన్యంలో మొత్తం తొమ్మిది క్వింటాళ్ల 30 కిలోలు ధాన్యాన్ని లెక్కల్లో తేడా చేశారని, సిఓ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.