అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి
On
ఈ సందర్భంగా చీకటాయపాలెం గ్రామానికి చెందిన పలువురు స్థానిక నిరుపేదలు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ దృష్ట్యా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టగా గ్రామానికి చెందిన అర్హులైన నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికీ నిజమైన నిరుపేదలకు ఇవ్వకుండా అనార్హులైన వారికి అధికారులు ఇండ్లను మంజూరు చేయడం చాలా బాధాకరమని తెలుపుతూ మాకు ఎలాంటి వ్యవసాయ భూములు లేవని మేము ఎలాంటి వాహనాలను కలిగి లేము అని కేవలం ఇల్లు కట్టుకోవడానికి గుంట జాగ మాత్రమే ఉందని మాలాంటి నిరుపేదలకు ఇవ్వకుండా అధికారులు విస్మరించడం చాలా బాధాకరమని గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పొందిన వారికి ఇల్లు కట్టుకున్న ఇంటిపై ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయడం సరైనదికాదంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామంలో మరోసారి సర్వేను నిర్వహించి అసలైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన నిరుపేదలు అశోక్, మల్లమ్మ,గౌరమ్మ, సకిన్యాబీ, వెంకటమ్మ, శ్రీకాంత్, ముత్తిలింగం, భవాని, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
