Mahalakshmi scheme : మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500...ఎలా పొందాలంటే...
ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇక ఈ ఉచిత బస్సు సౌకర్యంతో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ లలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీలలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం కూడా జరిగింది. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.500 కి గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తున్నారు.
ఈ పథకం ద్వారా లక్షల్లో మహిళలు లబ్ధి పొందుతున్నారు. కాని ముందు గ్యాస్ సిలిండర్ కు రూ.900 చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో తిరిగి రూ.400 జమ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు రూ.500 కి గ్యాస్ సిలిండర్లను పొందుతున్నారు. అదేవిధంగా గృహ జ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ విధంగా అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒకటి తరువాత ఒకటి పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీ కూడా ఒకటి చేయాల్సి ఉంది. అదే కుటుంబ మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం. ఎన్నికలకు ముందు మహిళలందరికీ నెలకు రూ.2500 ఖచ్చితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తామని ఈ గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటినుండి అమలు చేస్తారని ప్రతిపక్షాలు సైతం పదేపదే ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పథకం పై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలన్నీ పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకాలను పొందేందుకు అర్హులు అవుతారు.