Mayor Jakka Venkat Reddy: నిరుపేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం అందజేసిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి
On
Mayor Jakka Venkat Reddy: పీర్జాదిగూడ, క్విక్ టుడే : ఆర్థిక స్తోమత లేని నిరుపేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సహాయం అందజేసి పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పేద కుటుంబానికి చెందిన డి.వెంకటేష్ పద్మ దంపతుల కుమార్తె 20 సంవత్సరాల మనీష చదువు మధ్యలోనే ఆపేసింది. తనకు నచ్చిన చిత్రలేఖనం, వాల్ పెయింటింగ్ లో మంచి ప్రావీణ్యత చూపేడుతుందటంతో మిత్రుల ద్వార విషయం తెలుసుకొన్న మేయర్ జక్క వెంకట్ రెడ్డి పీర్జాడుగుడ మున్సిపల్ కార్యాలయంలో విద్యార్థిని మనీషాకు రూ.50వేల ఆర్ధిక సహాయం అందజేశారు.
ఉన్నతమైన చదువులు చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మేయర్, కార్పొరేటర్లు, నాయకులకు విద్యార్థిని మనీష ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, కోడె పోచయ్య, ఏంపల్ల అనంత రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, జావీద్ ఖాన్, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Also ఆర్థిక సాయం అందజేత
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...