హైదరాబాద్ మే 09, న్యూస్ :- పట్టణ అభివృద్ధి కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి..తొర్రూరు మున్సిపాలిటీ రూ.9.46 కోట్ల నిధుల మంజూరు మున్సిపాలిటీ అభివృద్దే లక్ష్యంగా,ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరు సాధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.రెండు నెలల వ్యవధిలో తొర్రూరు పట్టణానికి రూపాయలు పది కోట్లకు సమానం గల నిధులను సాధించి చూపారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ,ఎన్నికల తరువాత తక్కువ వ్యవధిలోనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు..

2025 మార్చి 20న ఎమ్మెల్యే తొర్రూరు పట్టణంలోని పలు వార్డుల్లో గల్లీగల్లీ పర్యటించారు.మున్సిపల్ అధికారులు,ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి రోడ్లు, డ్రైనేజీలపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా ఎమ్మెల్యే ప్రత్యక్షంగా గమనించారు.వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ హామీకి అనుగుణంగా,ఎమ్మెల్యే పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో కలుసుకుని,తొర్రూరు అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం విజ్ఞప్తి చేశారు.వారి నిరంతర ప్రయత్నాలతో రూ. 9 కోట్లు 46 లక్షల నిధులు మంజూరయ్యాయి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్పందిస్తూ ఏ పనినైనా ఇలాగే సాధిస్తా అని తొర్రూరు పట్టణ అభివృద్ధి నా ప్రాధాన్యత, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం, తక్కువ కాలంలోనే ఈ నిధులు రావడం సంతోషకరం, పనులన్నీ త్వరితగతిన ప్రారంభమవుతాయి అని పేర్కొన్నారు..
స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తక్షణ స్పందన, కృషిని అభినందించారు.అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు...
