పల్లా శ్రీనివాస్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తా..

పల్లా శ్రీనివాస్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తా..

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో (క్వైక్ టుడే న్యూస్):-టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పై తాను వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తున్నాను అని,ఈ పోరాటానికి కాంగ్రెస్, వైసిపి, సిపిఐ ,సిపిఎం, లోక్సత్తా మొదలైన పార్టీల మద్దతు కోరుతున్నట్టు తెలుగు శక్తి అధినేత బి.వి.రామ్ తెలిపారు. న్యూ కాలనీలోని సింకా గ్రాండ్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరినట్లు చెప్పారు. IMG-20250519-WA0060ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే చంపేస్తామని గాజువాక టిడిపి నాయకులు బెదిరిస్తున్నారు. ఆయన మనుషులు నన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారని,100 మంది ఒకేసారి దాడి చేసి చంపే ప్రయత్నం చేశారన్నారు. గాజువాకలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. దీనిపై పోలీస్ కమిషనర్ను కలిశానని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.ఆయన దీనిపై దృష్టి సారించి తనపై జరిగిన దాడిని ఖండించాలని, హాటల్ లో జరిగిన దాడి సంఘటన వీడియో తెప్పించుకుని చూడాలని కోరారు. ఈ దాడి నా ఒక్కడి మీద జరిగింది కాదని, తెలుగు ప్రజలపై జరిగిన దాడిగా చూడాలన్నారు. పల్లా శ్రీనివాసరావు ఒక మాఫియా లా తయారయ్యడని చెప్పారు. అతనిపై సిబిఐ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పల్లా శ్రీనివాస్ సిబిఐ దర్యాప్తు కోరుకోవాలన్నారు. నేను ఎవరికీ భయపడనని అన్నారు, చివరిదాకా పోరాటం చేస్తానన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని భావించామని అయితే టిడిపి నాయకులు జగన్ కంటే అరాచకంగా తయారయ్యారన్నారు. శాంతియుతమైన విశాఖలో పల్లా శ్రీనివాసు అండ్ గ్యాంగ్, పల్లా కార్తీక్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, వెనక్కుండి నడిపిస్తారని అనడం సరికాదన్నారు. పల్లా శ్రీనివాస్ దగ్గర ఉన్న మురళి అతని వ్యవహారాలన్నీ చూస్తారని, సెటిల్మెంట్లు, కలెక్షన్ అన్ని అతనే చేస్తారన్నారు. పల్లా శ్రీనివాసపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న అన్నారు. ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం అన్నారు. అన్ని పార్టీల మద్దతుతో న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. రక్షణ కోసం తాను పోలీస్ కమిషనర్ ని గన్ లైసెన్స్ కూడా అడుగుతానని చెప్పారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?