ఆంద్రా నుండి అక్రమ వరి ధాన్యం అడ్డుకున్న పోలీస్ యంత్రాంగం...

ఆంద్రా నుండి అక్రమ వరి ధాన్యం అడ్డుకున్న పోలీస్ యంత్రాంగం...

దామరచర్ల, మే 07 (క్విక్ టుడే న్యూస్):-నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వరి ధాన్యంతో కూడిన ఏపీ 39 టిఆర్ 1458 గల నెంబర్ లారీ అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా, తెలంగాణ రాష్ట్ర నల్లగొండ జిల్లా పోలీసు శాఖ మరియు రెవెన్యూ శాఖల సమన్వయంతో అడ్డుకోవడం జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం నల్లగొండ జిల్లా ఎస్పీ కి సమాచారం అందించగా, వెంటనే స్పందించి ఉన్నతాధికారి ఆదేశాల మేరకు నిలిపివేయడం జరిగిందని, సంబంధిత సమాచారం పై నల్లగొండ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ తో పాటుగా స్థానిక మిర్యాలగూడ డీఎస్పీ కే.రాజశేఖర్ రాజు  సంయుక్తంగా బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించి పలు అంశాలను పరిశీలించి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంఎస్పి ధరతో పాటుగా అదనంగా మరో 500 రూపాయలను బోనస్ గా చెల్లిస్తున్నందున, సరిహద్దు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు దళారులు అధిక ధరలకు తెలంగాణలో విక్రయించుకోవాలనే ఉద్దేశంతో, అక్రమ పద్ధతిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ మార్గం గుండా ప్రవేశించి తెలంగాణ రాష్ట్రంలో ఇతర పలు ప్రాంతాల్లో స్థానిక రైతుల పేరుతో వివిధ రైస్ మిల్లులకు విక్రయిస్తున్నారని తెలియజేస్తూ, గతంలో కూడా ఇదే మాదిరిగా అక్రమంగా వరి ధాన్యంతో ప్రవేశించిన మరో ఏడు లారీలను సీజ్ చేసి, వారి పై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు పట్టుబడి చేసిన వాహనం పై పూర్తి దర్యాప్తు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి ప్రవేశించే సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద ఆన్లైన్ సీసీ కెమెరాల ద్వారా నిత్యం జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ యంత్రాంగం క్షుణ్ణంగా పర్యవేక్షణ ఉంటుందని తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి అక్రమ వరి ధాన్యం తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకున్న నిర్ణయానికి, నల్లగొండ జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది.

IMG-20250507-WA0055

Read Also విలేజ్ పోలీసులు మెరుగైన సేవలు అందించాలి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?