రాజీవ్ యువ వికాసం పథకంకు సి-బిల్ స్కోర్ నిబంధన ఎత్తి వేయాలి

రాజీవ్ యువ వికాసం పథకంకు సి-బిల్ స్కోర్ నిబంధన ఎత్తి వేయాలి

మిర్యాలగూడ, మే 10 (క్విక్ టుడే న్యూస్):- రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సి-బిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇ-బీసీ లలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు 6000 కోట్ల రూపాయలతో 5లక్షల మందికి, రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్థులు స్వీకరించింది. ప్రభుత్వ నిర్ణయంతో 16లక్షల మంది నిరుద్యోగ యువత, నిరుపేదలు, దళితులు గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్థులు స్వీకరణ పూర్తి అయిన తరువాత సి-బిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టికొ ట్టడమే అవుతుంది విమర్శించారు. కరోనా తర్వాత ఇటీవల కాలంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక సంగతులు దెబ్బతిని సి-విల్ స్కోర్ హెచ్చుతగ్గులు అయిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. నిజమైన అర్హులు నిరుపేద, మధ్యతరగతి వారే ఉంటారు. వారికి 1లక్ష నుండి 4లక్షల వరకు లబ్ది అనే నిబంధనలతో పేదల బతుకుల్లో ఇలాంటి మార్పు రాదని అన్నారు. కనీసం 10లక్షలు వరకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధన ఎవ్వరి ప్రయోజనాల కోసం. ప్రభుత్వం నిర్ణయం వలన అనేక మంది పేదలకు రాజీవ్ యువ వికాసం రుణాలు వచ్చే అవకాశం లేదనీ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సి-బిల్ స్కోర్ నిబంధనను ఎత్తివేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుందనీ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

IMG-20250510-WA0023

Read Also గత ఏడాది కంటే ఐదు రెట్లు అధికంగా ధాన్యం దిగుబడి అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?