ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:-ఝాన్సీ రెడ్డి
On
శుక్రవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాన్ని స్థానిక జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో అనేక విభాగాల్లో ప్రముఖ వైద్యులు తమ సేవలు అందించనున్నారని, జనరల్ మెడిసిన్, షుగర్, బీపీ, ఈసీజీ, థైరాయిడ్, గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలు, పిల్లల వైద్యం, కంటి పరీక్షలు, ఉచిత కళ్లద్దాల పంపిణీ, చర్మ మరియు నరాల సంబంధిత వైద్యం, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని, అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో మాజీ టిపిసిసి సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, నాయకులు డాక్టర్ పొనుగొట్టి సోమేశ్వరరావు, చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్, మేకల కుమార్,మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి,సుదర్శన్ గౌడ్, నల్లమాస సమ్మయ్య, నల్లపు రాజు, మహబూబ్ రెడ్డి, ప్రశాంతి, బిక్షం గౌడ్, దామోదర్ రావు,దొంగరి శంకర్, వెన్నం సోమిరెడ్డి, ప్రళహద రావు, చిదిరాల రవి,చిన్న కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
