శివ్వంపేట మే 9 (క్విక్ టు డే న్యూస్):- భారత్-పాక్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చాకరిమెట్లలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో శాతగట్టాభిషేకం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. హనుమన్ ఉపాసకుడు దుర్గాప్రసాద్ స్వామి నేతృత్వంలో ప్రత్యేక పూజలు, హారతులు చేపట్టారు. నర్సాపూర్ అయ్యప్ప మారుతి క్లాత్ స్టోర్ యజమాని ఆంజనేయులు సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ ఆంజనేయ శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు శాస్త్రుల దేవదత్త శర్మ ఈవో శ్రీనివాస్, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
