తొర్రూర్ మే 07(క్విక్ టుడే న్యూస్):- పట్టణంలోని పాటిమీద శ్రీమాతా గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో బుధవారం వైశాఖ శుద్ధ దశమి అనగా శ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట వహించిన సుదినం కావున స్వామివారికి 332 వ ఆరాధన గురు పూజ మహోత్సవ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రామగిరి విక్రమ్ శర్మ.రాగిభాస్కరాచార్యులు సుప్రభాత సేవతో మొదలుకొని మూల విరాట్ లకు పంచామృత అభిషేకములు గణాధిపతి పూజ పుణ్యాహవాచనము బ్రహ్మాది దేవతల ఆవాహనము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అష్టోత్తర శతనామ పుష్ప పూజ సరస్వతీ అమ్మవారికి అష్టోత్తర శతనామా పుష్ప పూజలు అనంతరం మహా నివేదన మంత్రపుష్ప తీర్థ ప్రసాద వితరణ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల మాల ధారణ దీక్ష స్వాములకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించరు.ఈ కార్యక్రమంలో మాత శ్రీ గోవిందమాంబదేవి సమేత శ్రీశ్రీశ్రీ జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయ నిర్వహణ శాశ్వత నిధి కమిటీ అధ్యక్షులు కల్లూరి నాగేంద్ర చారి,ప్రధాన కార్యదర్శి తంగళ్ళపల్లి పూర్ణాచారి,కోశాధికారి అలుగోజు చంద్రశేఖరచారి,ఉపాధ్యక్షులు బోగోజు సదానందచారి,పబ్బోజు వెంకటాచారి,సహాయ కార్యదర్శులు అబ్బనపురి పూర్ణాచారి,రాగి శ్రీనివాసచారి,గజ్జల వెంకటేశ్వర్లు, ఉత్సవ మహిళ కమిటీ సభ్యులు సిరికొండ సరస్వతి,కల్లూరి స్వరూప,శాశ్వత నిధి సభ్యులు కల్లూరి శ్రీనివాసచారి, పెందోట జలేంద్రచారి,రుద్రోజు రవిశంకర్,రుద్రోజు వీర బ్రహ్మచారి,తంగేళ్లపల్లి శ్యాం సుందరాచార్యులు, దాసరోజు సీతారాములు,ఇరుముడి స్వాములు,మునిగంటి రవీంద్ర చారి స్వామీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

