అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేయాలని వినతి పత్రం సమర్పణ..

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేయాలని వినతి పత్రం సమర్పణ..

తొర్రూర్ మే 05(క్విక్ టుడే న్యూస్):- భారతీయ జనతా పార్టీ తోర్రూర్  మండల శాఖ ఆధ్వర్యంలో తొర్రూరు మండల ఎంపీడీవో పూర్ణచందర్ పాలకుర్తి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ పూసాల శ్రీమాన్ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పూసాల శ్రీమాన్ మాట్లాడుతూ... తొర్రూరు మండలం, వెంకటాపురం గ్రామంలో రాజకీయ కక్షల కారణంగా ఓ అర్హుడైన బీజేపీ నాయకుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినా దానిని గ్రామ కాంగ్రెస్ నాయకులు,ఆయన బిజెపి నాయకుడంటూ సర్వే చేసిన అధికారులను ఎమ్మెల్యే పీఎ తో ఫోన్ చేయించి తీవ్రంగా ఒత్తిడి చేసి, మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను తీయించారు.ఈ ఘటనపై బిజెపి కార్యకర్తలు మండిపడుతూ అర్హత ఉన్న వ్యక్తికి రాజకీయ విద్వేషంతో ఇల్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,సామాజిక సంక్షేమ పథకాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.అర్హులందరికీ సమానంగా పథకాలు వర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు.అర్హులైన వారికి కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఇచ్చుకోవడం సిగ్గుచేటు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ కుమార్,జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లె కుమార్, తొర్రూరు మున్సిపల్ అధ్యక్షుడు ఫైండ్ల రాజేష్ , మండలం ప్రధాన కార్యదర్శి కొండ యాకన్న గౌడ్, దేవరకొండ విష్ణువర్ధన్ చారి మంగళ పెళ్లి యాకయ్య,నూకల నవీన్, శీలం శ్రీనాథ్,మార్క సందీప్, గోనే మహేష్,తదితరులు పాల్గొన్నారు.

IMG-20250505-WA0039

Read Also డెంగ్యూ వ్యాధి జాతీయ దినోత్సవ అవగాహన ర్యాలీ 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?