మాడుగులపల్లి, మే 08 (క్విక్ టుడే న్యూస్):- ప్రపంచ మానవాళికి నష్టం కలిగించే ఉగ్రవాదాన్ని, పూర్తిగా అంతమొందిస్తేనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో శాంతి, సామరస్యం నెలకొంటుందని యంజెయఫ్ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు దర్శనం రాంబాబు అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న, ఏ దేశంలో ఉన్న, నష్టం జరుగుతుందే తప్ప లాభం లేదన్నారు. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో ప్రపంచంలోని అన్ని దేశాది నేతలు ఏకమై ఉగ్రవాదాన్ని నిర్ములించాలని విజ్ఞప్తి చేశారు. పహాల్గం లో అమాయక ప్రజలను, పర్యాటకులను, పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద మూకలను వదలొద్దని, దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం ను కోరుతున్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ లో విరోచిత దాడులు చేసిన భారత సైన్యం పాత్ర మరువలేనిదని కొనియాడారు. ప్రముత్తంగా ఉండి ఉగ్రవాదులు చేసే దాడులను దీటుగా ఎదుర్కొని, దేశ ప్రజలను, దేశాన్ని, సైనికులు రక్షించాలని కోరారు.
