ఆర్టీసీ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకం

ఆర్టీసీ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకం

తొర్రూరు మే 10(క్విక్ టుడే న్యూస్):- ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో సిబ్బంది పాత్ర కీలకమని వరంగల్ ఆర్ఎం విజయభాను తెలిపారు. శనివారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో వరంగల్ రీజియన్ ప్రగతి చక్రం త్రైమాసిక పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని ఆయా డిపోలకు చెందిన ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. తొర్రూరు డి ఎం పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎం విజయభాను మాట్లాడారు.ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకమని తెలిపారు. రవాణా వ్యవస్థలో అతిపెద్ద సంస్థ అయిన ఆర్టీసీ నిత్యం వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుందని తెలిపారు. డ్రైవర్ గా విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.వ్యసనాల జోలికి వెళ్ళవద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంపుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోనే ఉత్తమ రీజియన్ గా వరంగల్ ను నిలిపేందుకు సిబ్బంది తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం లు భాను కిరణ్, మహేష్, ఎం ఎఫ్ విజయ్ కుమార్, ఆయా డిపోల మేనేజర్లు ధరం సింగ్(హనుమకొండ), శివ ప్రసాద్ (మహబూబాబాద్), ప్రసన్నలక్ష్మి (నర్సంపేట), ఇందు (భూపాలపల్లి),  జ్యోత్స్న (వరంగల్–2), రవిచందర్ (పరకాల), అర్పిత (వరంగల్–1), ఎస్టిఐ రజిత రెడ్డి, ఆయా డిపోల సిబ్బంది మల్లికార్జున్,ఆర్ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250510-WA0048

Read Also ఆర్థిక సహాయం అందజేత

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?