మేడిప‌ల్లిలో విషాదం.. ముగ్గురు పిల్ల‌ల‌తో స‌హా చెరువులో దూకిన మ‌హిళ 

మేడిప‌ల్లిలో విషాదం.. ముగ్గురు పిల్ల‌ల‌తో స‌హా చెరువులో దూకిన మ‌హిళ 

మేడిపల్లి, మే 15 (క్విక్ టుడే న్యూస్‌):-  మేడిప‌ల్లిలో తీవ్ర విషాదం జ‌రిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మ‌హిళ త‌న‌ ముగ్గురు కూతుళ్లతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘ‌ట‌న మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.IMG-20250515-WA0042 స‌మీప బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా  అడ్డాక‌ల్ మండ‌లం కన్మనూరు గ్రామానికి చెందిన లోకమని నాగరాజు (35), భార్య లోకమని సుజాత (32), లు 15 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు మేడిప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని నార‌ప‌ల్లిలో ఉన్న‌ మహాలక్ష్మి పురం కాలనీ నివాసం ఉంటున్నారు. భార్య చెరుకు రసం బండి, భర్త ఆటో నడుపుతూ జీవనం కొన‌సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడ‌పిల్ల‌లు. పెద్ద‌కూతురు అక్షిత (13), 8 వ తరగతి, రెండో కుమార్తె ఉదయశ్రీ (11) 6 వ తరగతి, చిన్న కూతురు వర్షిణి (6) 1 వ తరగతి నారపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.  అయితే ఇటీవల కాలంలో భార్యపై అనుమానం పెర‌గ‌డంతో భార్య భర్తలు మధ్య గొడవలు ఎక్కువ‌య్యాయి. బుధవారం పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వ‌హించారు. రాత్రంతా ఇద్దరు గొడవ పడుతూ ఉండడంతో సుజాత మనస్థాపానికి గురై తన ముగ్గురు పిల్లలతో కలిసి నారపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ విష‌యాన్ని స్థానికులు గమనించి వీరిని కాపాడే ప్ర‌య‌త్నం చేసి ఇద్దరు పిల్లలను రక్షించారు. అయితే తల్లి సుజాత, చిన్న కుమార్తె వర్షిణి నీటిలో మునిగి చనిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను కూడా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ ఇద్ద‌రి పిల్ల‌ల‌ పరిస్థితి విషమంగానే ఉన్న‌ట్లు మృతురాలి బంధువులు తెలిపారు. సుజాత బంధువులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?