Savitribai Phule : నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 10 (క్విక్ టుడే) : భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి, ఉద్యమకారిణి ష సావిత్రిబాయి పూలే; 127వర్ధంతి పురస్కరించుకొని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న బీపీ మండల్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి మాట్లాడుతూ 19వ శతాబ్దం మొదటి భాగంలో మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అన్నారు. ఆమె తన భర్త ప్రోద్బలం తో చదువు నేర్చుకొని తన తోటి మహిళలకు చదువు నేర్పడం కోసం అనేక మహిళా పాఠశాలలను నెలకొల్పి వారిని విద్యావంతులను చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా నిలదొక్కుకొని సమాజాన్ని చైతన్యం చేసిన ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్, ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ కార్యదర్శిలు అక్కినపల్లి లక్ష్మయ్య, ఖమ్మం పాటి రాజు, దళిత కవి వేముల ఎల్లన్న, గౌడ సంఘం చెరుకు మల్లికార్జున్ గౌడ్, బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండె వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం దశరథ, వనం లలిత, సుజాత , సూరెడ్డి సరస్వతి సమాచార సమితి నాయకులు బండ మీద అంజయ్య, యాదవ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్ యాదవ ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్ బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ చారి, రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఆమంచి అంజయ్య, లగడ పురం వెంకన్న, వల్ల కీర్తి శ్రీనివాస్ దుర్గయ్య, పగిలి కృష్ణ ,తిరుపతయ్య గౌడ్ బెస్త సంఘం నాయకులు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.