నల్లగొండ, మే 14 (క్విక్ టుడే న్యూస్):- ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంవర్దవంతమైన సేవలు అందిస్తూ, సత్వర న్యాయం జరిగేలా గ్రామ పోలీసు అధికారులు పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో బుధవారం నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు.

గ్రామ పోలీసు అధికారుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రతిరోజు వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమవుతూ, సమస్యల పై అధికారులకు తెలియజేస్తూ, సత్వర పరిష్కార దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సబంధాలు ఏర్పాటు ద్వారా నేర నియంత్రణ సాధ్యం అవుతుందని తెలిపారు. ఇందుకుగాను గ్రామాల్లో కి కొత్తగా వచ్చే అనుమానితుల సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలని, అప్పుడే గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధించడానికి ఉపయోగపడతాయని అన్నారు. జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజలతో మమేకం అవుతు, ప్రజలకు సైబర్ నేరాలు, బెట్టింగ్, గేమింగ్ యాప్స్ పై కలిగే అనర్ధాలపై గ్రామాలలో దొంగతనాలు, జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించడం, రోడ్డు ప్రమాదాలు, యువత చెడు వ్యసనాలు డ్రగ్స్ కి అలవాటు పడకుండా వాటి ద్వారా జరిగే అనర్థాల పై అవగాహన, నేర నియంత్రణ,ఇతర అంశాల మీద అవగాహన కల్పించినందుకు జిల్లా పోలీసు కార్యాలయంలో ఏడుగురు గ్రామ పోలీస్ అధికారులను అభినందించి రివార్డ్ అందజేశారు.