Tirupati Tour : ఎండాకాలం సెలవుల్లో తిరుపతి ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్ లో వెళ్లాలంటే ఇలా చేయండి.. శ్రీవారి దర్శనంతో పాటు ఇతర టెంపుల్స్ కూడా 

Tirupati Tour : ఎండాకాలం సెలవుల్లో తిరుపతి ప్లాన్ చేస్తున్నారా? తక్కువ బడ్జెట్ లో వెళ్లాలంటే ఇలా చేయండి.. శ్రీవారి దర్శనంతో పాటు ఇతర టెంపుల్స్ కూడా 

Tirupati Tour : ఎండాకాలం రానే వచ్చింది. ఇంకొన్ని రోజులు అయితే స్కూళ్లు, కాలేజీలు మూత పడతాయి. ఓ రెండు నెలల పాటు విద్యార్థులకు రెస్ట్. చాలామంది తమ పిల్లలకు వేసవి సెలవులు పడగానే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలకు ప్లాన్ చేస్తుంటారు. పిల్లలు కూడా అప్పుడే ఫ్రీగా ఉంటారు కాబట్టి.. వాళ్లకు స్కూల్స్ కూడా ఉండవు కాబట్టి అప్పుడైతేనే ప్రయాణాలు బెటర్ అనుకుంటారు కొందరు. 

అందుకే.. మంచి టూరిస్టు ప్లేసులకు కొందరు ప్లాన్ చేసుకుంటే.. మరికొందరు పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటారు. కానీ.. చాలామంది మాత్రం తిరుపతికి వెళ్లాలని అనుకుంటారు. అయితే.. తిరుపతికి వెళ్లడం అంతే అంత ఈజీ కాదు. ట్రెయిన్ టికెట్స్ అస్సలు దొరకవు. అందులోనూ పక్కా ప్లాన్ చేసుకొని తిరుపతికి వెళ్లాలి.

తిరుపతికి వెళ్లిన వాళ్లు ఖచ్చితంగా దగ్గర్లోని మరికొన్ని టెంపుల్స్ చూడొచ్చు. ఇతర టూరిస్టు ప్లేస్ లను కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ.. అవన్నీ కవర్ చేయాలంటే ఖచ్చితంగా పక్కా ప్లాన్ తో వెళ్లాలి. అటువంటి వాళ్ల కోసమే ఐఆర్‌సీటీసీ మంచి ప్లాన్ తీసుకొచ్చింది. బడ్జెట్ లో ఫ్యామిలీ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

Tirupati Tour : వీకెండ్ ట్రిప్ టు తిరుమల దర్శన్ టూర్ ప్రత్యేకతలివే

207 -4

వీకెండ్ ట్రిప్ టు తిరుమల దర్శన్ పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ఏపీలోని వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్యాకేజీ తీసుకుంటే మూడు రాత్రులు, 4 రోజులు టూర్ ఎంజాయ్ చేయొచ్చు. 

ఈ ప్యాకేజీలో భాగంగా ముందు తిరుపతి తీసుకెళ్తారు. అక్కడి నుంచి తిరుమలలో శ్రీనివాసుడి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. అనంతరం తిరుపతి నుంచి కాణిపాకం తీసుకెళ్తారు. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం, తిరుచానూర్ తీసుకెళ్తారు. అక్కడి నుంచి శ్రీకాళహస్తి గుడికి ఐఆర్సీటీసీ వాళ్లు తీసుకెళ్తారు.

ఇది వీకెండ్ టూర్. అంటే ప్రతి శుక్రవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. వైజాగ్ లో మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ ట్రెయిన్ శనివారం ఉదయం 4 గంటలకు తిరుపతికి తీసుకెళ్తుంది. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కాణిపాకం, మంగాపురం ఆలయాలను దర్శనం చేసుకోవాలి. 

అనంతరం రాత్రి తిరుపతికి చేరుకోవాలి. ఉదయమే తిరుచానూర్ ట్రిప్ ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాళహస్తికి తీసుకెళ్తారు. శ్రీకాళహస్తి నుంచి మధ్యాహ్నానికి తిరిగి వచ్చాక తిరుమల తీసుకెళ్లి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేయిస్తారు. దర్శనం పూర్తి కాగానే తిరిగి రాత్రి 8.30 కు తిరుపతిలో రైలు ఎక్కి సోమవారం ఉదయం 11.30 కు వైజాగ్ లో దిగాల్సి ఉంటుంది. 

ఈ ప్యాకేజీలో భాగంగా ట్రెయిన్ టికెట్స్, వసతి, సైట్ సీయింగ్, ఫుడ్, తిరుమల దర్శనం, ఇతర ఆలయాలకు ట్రాన్స్ పోర్ట్, ట్రావెల్ ఇన్సురెన్స్ అన్నీ అందిస్తారు. ఇందులో రెండు ప్యాకేజీలు ఉంటాయి. ఒకటి కంఫర్ట్ క్లాస్, ఇంకోటి స్టాండర్డ్ క్లాస్. 

207 -2

స్టాండర్డ్ క్లాస్ లో ఫెయిర్ కాస్త తక్కువగా ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ లో కాస్త ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ లో ముగ్గురు షేరింగ్ కి ఒక్కొక్కరికి రూ.12,695 చెల్లించాలి. డబుల్ షేరింగ్ కి రూ.15,200, సింగిల్ అయితే రూ.25,510 చెల్లించాలి.

ఇక.. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కి రూ.23,415 చెల్లించాలి. డబల్ షేరింగ్ కు రూ.13,105 చెల్లించాలి. స్టాండర్డ్ షేరింగ్ కు రూ.10,600 చెల్లించాల్సి ఉంటుంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?