Vizag Kailasagiri Ropeway : సమ్మర్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇదే.. పూర్తి వివరాలివే..
Vizag Kailasagiri Ropeway : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక ప్రదేశాల జాబితాలో విశాఖపట్నం ముందు వరసలో ఉంటుంది. విశాఖ అనగానే ముందు గుర్తుకు వచ్చేది అక్కడ ఉన్న బీచ్ లు. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వీటి తర్వాత మాత్రం స్థానం తప్పకుండా కైలాసగిరికే దక్కుతుంది.
కైలాసగిరి అనేది కొండపై ఉన్న ఉద్యనవన ప్రదేశం. కొండ కింద ఉన్న కైలాసనాదుని దేవాలయం వలన దీనికి కైలాసగిరి అనే పేరు వచ్చింది. కైలాసగిరి కొండపై ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. మీరు విశాఖపట్ననికి సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎన్నో పర్యాటక ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి.

విశాఖపట్నం వచ్చే ప్రతి పర్యటకులకు కూడా సుందర సాగర తీరాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో కనువిందు చేసేటువంటి ఉద్యనవనాలు కూడా ఉన్నాయి. ఈ సమ్మర్ కి విశాఖపట్నం రావాలి అని అనుకునే పర్యటకులకు కైలాసగిరి వినోదానికి కేరాఫ్ గా మారుతుంది. ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో పర్యటకులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ కైలాసగిరి అనేది సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో, 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఇక్కడికి వస్తున్నటువంటి పర్యటకులు ఎంతో సరదాగా ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. ఈ కొండపై ఎత్తైన తెల్లని శివపార్వతుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
విశాఖ నగరానికి గుర్తింపు చిహ్నంగా ఈ విగ్రహాన్ని పరిగణిస్తారు. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసిపోతుంది. ఈ కొండ అనేది నగరానికే తల మాని కంగా నిలుస్తుంది. ఈ కైలాసగిరి పైకి వెళ్ళటానికి మెట్లు, రోడ్డు, రోప్ వే మార్గం ద్వారా పర్యటకుల అక్కడికి చేరుకోవచ్చు. వాటిలో రోప్ వే ప్రయాణం అనేది ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
విశాఖపట్నం వచ్చే ప్రతి పర్యటకులకు ఈ రోప్ వే అనేది మీ జీవితంలో మర్చిపోని విధంగా చేస్తుంది. విశాఖ సాగర తీర అందాలను చూడాలి అనుకునేవారు. కైలాసగిరిని కచ్చితంగా ఆస్వాదించి తీరాలి. ఈ కైలాసగిరి రోప్ వే లో మార్గంలో వెళ్లేందుకు అప్ అండ్ డౌన్ చార్జీలు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.80 వసూలు చేస్తున్నారు.
ఈ రోప్ వే ఎక్కితే ఆ అనుభూతి చాలా బాగుంటుంది అని పర్యటకులు అంటున్నారు. ఈ రోప్ వే పైకి వెళ్ళటానికి ఉదయం 11 గంటలకు నుండి అందుబాటులో ఉంటుంది. రాత్రి 7:30 తర్వాత ఈ రోప్ వే ప్రయాణం అనేది నిలిపివేయడం జరుగుతుంది. చాలావరకు కైలాసగిరిలో పిల్లల కోసమే పార్కులు మరియు అన్ని రకాల ఆట పరికరాలు ఇక్కడ ఉన్నాయి.
కొండపైకి పిల్లలు, పెద్దలు ఎక్కేందుకు గుర్రపు స్వారీలు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేసే అనువైన ప్రదేశం అని కైలాసగిరి చూసే పర్యటకులు మాటల్లో చెబుతున్నారు. ఇతర మార్గాల కన్నా రోప్ వే ఎంతో అద్భుతంగా ఉంటుంది అని వర్ణిస్తున్నారు. దేశంలోనే ఇలాంటి ప్రదేశం లేదు అనే చెప్పవచ్చు.
కొండ చుట్టూ తిరగటానికి ఒక చిన్న పాటి రైలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎలా చేరుకోవాలి అంటే. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 10.5 కిలోమీటర్లు,రైల్వే స్టేషన్ నుండి 11.7 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి పర్యాటక ప్రాంతం అనేది ఉన్నది. కావున ఇక్కడికి బస్సు మరియు ఆటో సౌకర్యం కూడా కలదు.
ముఖ్యమైన విషయం ఏమిటి అంటే. ఈ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. కాబట్టి కైలాసగిరి దగ్గరలో ఎయిర్ పోర్టు ఉంది. ఇక్కడ నుండి కైలాసగిరి 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎయిర్ పోర్టు నుండి క్యాబ్ ద్వారా 45 నిమిషాల్లో కైలాసగిరి చేరవచ్చు. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం కావడం తో అన్ని ప్రధాన నగరాల నుండి విశాఖపట్నంకి విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.