Ooty Tour From Hyderabad : వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఊటీకి చెక్కేయాల్సిందే..

Ooty Tour From Hyderabad : వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఊటీకి చెక్కేయాల్సిందే..

Ooty Tour From Hyderabad : ఎండాకాలం వచ్చేసింది. మన దగ్గర ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చేది ఊటీ, కొడైకెనాల్, కులుమనాలి. ఈ ప్రాంతాల్లో చల్లగా ఉండటం వల్ల ఎండ వేడి నుంచి తట్టుకోవడం కోసం చాలామంది ఈ ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. 

అందుకే వేసవి సెలవుల్లో చాలామంది ఊటీని ఎంచుకుంటారు. హైదరాబాద్ నుంచి ఊటీ దగ్గర కావడంతో ఊటీకి వెళ్లి అక్కడ కొన్ని రోజులు సేద తీరుతారు. అయితే.. చాలామందికి ఊటీకి ఎలా వెళ్లాలో, అక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు. అటువంటి వాళ్ల కోసమే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ట్రాన్స్‌పోర్ట్, అకామడేషన్ కూడా అందిస్తోంది. 

ఈ ప్యాకేజీ పేరు అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్. ఈ ప్యాకేజీలో భాగంగా 6 రోజులు హైదరాబాద్ నుంచి ఊటీకి టూర్ ప్యాకేజీ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజులు. ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీ, కూనూర్ ను సందర్శించవచ్చు. ట్రెయిన్ టికెట్స్, క్యాబ్, హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సురెన్స్ అన్నీ ఈ టూర్ ప్యాకేజీలో వర్తిస్తాయి. 

9 -1

Ooty Tour From Hyderabad : సికింద్రాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం

ఈ ప్యాకేజీలో భాగంగా సికింద్రాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ బోగీల్లో టికెట్లు బుక్ చేస్తారు. ప్యాకేజీని బట్టి ప్యాకేజీ ధర మారుతుంది. థర్డ్ ఏసీ టికెట్ కావాలని అనుకునే వాళ్లకు సింగిల్ షేరింగ్ అయితే రూ.33020 ధర ఉంటుంది.

ఇద్దరు షేరింగ్ అయితే రూ.18480, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ.14870 అవుతుంది. 5 నుంచి 11 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు రూ.9430 ధర ఉంటుంది. స్టాండర్డ్ అంటే స్లీపర్ క్లాస్ లో భాగంగా సింగిల్ షేరింగ్ లో రూ.30560, ట్విన్ షేరింగ్ లో రూ.16020, ట్రిపుల్ షేరింగ్ లో రూ.12410, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.6970 తీసుకుంటారు. 

సికింద్రాబాద్ తో పాటు నల్గొండ, గుంటూరు, తెనాలి రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికులు రైలు ఎక్కొచ్చు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12.20 కి శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూరు రైల్వే స్టేషన్ లో దిగాల్సి ఉంటుంది. 

9 -2

కొయంబత్తూరు నుంచి 90 కిమీల దూరంలో ఉన్న ఊటీకి ఐఆర్సీటీసీ సిబ్బంది వాహనంలో తీసుకెళ్తారు. అక్కడికి వెళ్లాక హోటల్ లో కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఊటీ టూర్ కు తీసుకెళ్తారు. అలా మూడు రోజులు ఊటీ మొత్తం తిప్పాక.. నాలుగో రోజు ఉదయం కూనూర్ తీసుకెళ్తారు. రాత్రి ఊటీకి చేరుకొని ఐదో రోజు కొయంబత్తూర్ కు వచ్చి సాయంత్రం శబరి ట్రెయిన్ ఎక్కాల్సి ఉంటుంది. 

అయితే.. ఈ టూర్ లో బ్రేక్ ఫాస్ట్ మాత్రం ఉచితంగా అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలు మాత్రం ప్రయాణికులే చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఎంట్రీ టికెట్స్ ఉన్నా అవి ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. గైడ్స్ ను కూడా యాత్రికులే చూసుకోవాలి. 

ఊటీ, కూనూర్ అందాలను చూడాలనుకుంటే.. మీకు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అనుకుంటే ఐఆర్సీటీసీ ప్యాకేజీ బెస్ట్ ప్లాన్ అవుతుంది. మరిన్ని వివరాలకు 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?