Shirdi flight tour : హైదరాబాద్ నుండి షిర్డీకి ఫ్లైట్ టూర్ ప్యాకేజ్ వివరాలు..
దీని ద్వారా షిర్డీ వెళ్లే భక్తులకు కూడా వెసులుబాటు కలుగుతుంది. తెలంగాణ పర్యటక అభివృద్ధి సంస్థ ప్రకటించిన ఈ తాజా ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ లో విమానాశ్రయానికి చేర్చడం దగ్గర నుండి షిర్డీ లో స్థానికంగా పర్యటన ప్రాంతాలకు తీసుకెళ్లటం అంత కూడా తమ బాధ్యత అని సంస్థ ప్రకటన చేసింది.
ఈ జర్నీ హైదరాబాద్ నుండి ఉంటుంది. హైదరాబాద్ నుండి షిర్డీ వెళ్లే ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్ ఫొర్ట్ నుండి మధ్యాహ్నం 01:30pm కు బయలుదేరుతుంది. 2:50pm కు షిర్డీ ఎయిర్ పోర్టుకు చేరుతుంది. 3:30pm కు హోటల్ కి వెళ్లిపోతారు. దాని తర్వాత సాయిబాబా దర్శనానికి వెళ్తారు.
సాయంత్రం టైమ్ లో జరుగుతున్నటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు వీఐపీ దర్శనం లేక ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. 7:00pm-7:30pm మధ్య THEME PARK షో కూడా ఉంటుంది. రాత్రి టైమ్ లో 8:00గంటల వరకు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 తర్వాత హోటల్ కి చేరుకుంటారు.
Day 2: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత పంచముఖి గణపతి టెంపుల్ కు మీరు వెళ్తారు. ఓల్డ్ షిర్డీ ని చూస్తారు. kandoba మందిర్ కు వెళ్లడంతో పాటుగా SAI TEETH ను కూడా చూస్తారు. మధ్యాహ్నం12:30pm కు చేరుకుంటారు. సాయంత్రం 5:30pm కు ఫ్లైట్ లో హైదరాబాదుకు మీరు చేరుకుంటారు. ఈ ప్యాకేజీ ధర వచ్చేసి రూ.12,499గా ఉన్నది.
ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్ తో పాటు వసతి సౌకర్యము కూడా ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించండి.https://tourism.telangana.gov. in వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు బుకింగ్ ప్రాసెస్ కూడా పూర్తి చేయవచ్చు..