Suryalanka Beach Bapatla : తక్కువ ఖర్చుతో బీచ్ చూడాలి అనుకుంటున్న వారికిి శుభవార్త.. బాపట్ల బీచ్ బెస్ట్ ఆప్షన్

Suryalanka Beach Bapatla : తక్కువ ఖర్చుతో బీచ్ చూడాలి అనుకుంటున్న వారికిి శుభవార్త.. బాపట్ల బీచ్ బెస్ట్ ఆప్షన్

Suryalanka Beach Bapatla : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ బీచ్ లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సముద్రం ఒడ్డున నిలబడి అలలు కాళ్లకు తాగులుతుంటే ,మరోవైపు సముద్రపు గాలిని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందమే వేరు. అందుకే చాలామంది సముద్రపు ఒడ్డున అందాలను చూడాలని కోరుకుంటారు. అయితే తెలంగాణ ప్రజలు ఇప్పుడు దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు.

మనకు సమీపంలో గల బాపట్ల బీచ్ కు వెళ్తే సరిపోతుంది. ఇక ఈ బీచ్ ను సూర్యలంక బీచ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడకు వెళ్లినట్లయితే సముద్రం చూడాలని కోరిక ఉన్నవారి కోరిక నెరవేరుతుంది. అంతేకాక ప్రస్తుత కాలంలో చాలామంది ఇక్కడకు వెళ్లి మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి బాపట్లకి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

బీచ్ చూడాలి అక్కడ ఎంజాయ్ చేయాలి అని అనుకునేవారు ఇప్పుడు నేరుగా సూర్యలంక బీచ్ కి వెళ్తున్నారు. అంతేకాక సూర్యలంక బీచ్ ఒడ్డు చాలా విశాలంగా ఉండడంతో పర్యాటకులు ఈ బీచ్ లో రద్దీగా ఉన్న అనుభూతిని పొందకుండా సరదాగా మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయవచ్చు.

144 -1

మరి ముఖ్యంగా సముద్ర ప్రేమికులు ఇక్కడికి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ఒడిదుడుకుల జీవితంలో మానసిక ప్రశాంతతను పొందేందుకు ఈ సముద్రపు వాతావరణం ఎంతో అవసరం అవుతుంది. ఇక ఈ ట్రిప్ అనేది జీవితకాలం మీకు మంచి జ్ఞాపకాలను గుర్తుండిపోయేలాా చేస్తుంది. 

అయితే బాపట్ల పట్టణం సూర్యలంక బీచ్ నుండి దాదాపు 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంతేకాక ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో చాలామంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఎంజాయ్ చేయాలని చూస్తారు. అలాంటి వారికి సూర్యలంక బీచ్ మంచి ప్రదేశం అని చెప్పవచ్చు. సముద్రపు అలల మధ్య ఏకాంతంగా గడపాలి అనుకునేవారు ఈ బీచ్ ను సందర్శించడం మంచి అనుభూతిని కలిగిస్తుంది.

అయితే సూర్యలంక బీచ్ లో వేసవికాలం విపరీతమైన వేడి ఉంటుంది. కాబట్టి ఈ బీచ్ కు మీరు సాయంత్రం 6 గంటలకు వెళ్తే మంచి అనుభూతులు చెందుతారు. ఇక ఈ సూర్యలంక బీచ్ లో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు చాలా బాగుంటుంది. ఈ సమయంలో సూర్యలంక బీచ్ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే సెలవల సమయంలో కూడా సూర్యలంక బీచ్ ఉత్తమ ప్రదేశమని చెప్పవచ్చు.

144 -3

ప్రయాణం...

అయితే ఈ సూర్యలంక బీచ్ కి మీరు హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే కారు లేదా ఇతర వాహనాలను తీసుకుని వెళ్ళవచ్చు. అలాగే మార్కెట్ లో ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవ్ కార్లతో పాటు టూరిజం వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి  వాటిని ఉపయోగించుకోవచ్చు.

ఇక హైదరాబాద్ నుండి సూర్యలంక బీచ్ కు దాదాపు 320 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాక మీరు బస్సు ప్రయాణం చేస్తూ కూడా ఈ బీచ్ కు చేరుకోవచ్చు. దీనికోసం మీకు ఎంజీబీఎస్ లో బస్సులో అందుబాటులో ఉన్నాయి. అలాగే ట్రైన్ మార్గం ద్వారా కూడా మీరు బాపట్ల చేరుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు బీచ్ చూడాలి అనుకుంటే మాత్రం కచ్చితంగా వారికి బాపట్ల బీచ్ మంచి ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే తక్కువ ఖర్చులో ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాక సూర్యలంక బీచ్ స్విమ్మింగ్ మరియు సన్ బాత్ కోసం కూడా ప్రసిద్ధి. అలాగే ఇక్కడ ఓ పర్యాటక ప్రదేశం కూడా ఉంది.

144 -4

అదే సూర్యలంక బీచ్ కు అతి సమీపంలో గల భవనారాయణ స్వామి దేవాలయం. ఈ ఆలయం దాదాపు 15వ శతాబ్దం నాటిది. అలాగే బీచ్ నుంచి 0.3  కిలోమీటర్ల దూరంలో ఆంజనేయస్వామి దేవాలయంం కూడా ఉంది.

బాపట్ల బీచ్ లో బస ఎలా...

బాపట్ల బీచ్ చేరుకున్న తర్వాత పర్యాటకులు బస చేయాలి అనుకుంటే ఇక్కడ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సూర్యలంక బీచ్ కు హరిత బీచ్ రిసార్ట్  ,సూర్యలంక బీచ్ రిసార్ట్ దగ్గరగా ఉన్నాయి.  మీరు దీనిలో బస చేయవచ్చు. కావున అందుబాటు ధరలో బీచ్ చూడాలి అనుకున్న వారు బాపట్ల బీచ్ ను సందర్శించి రావచ్చు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?