కేరళ భూతల స్వర్గం.. జీవితంలో ఒక్కసారి అయినా కేరళ ప్రాంతానికి చూసి రావాలి.. ఎటు చూసినా పచ్చని తేయాకు తోటలు.. ఉవ్వెత్తున లేచే బ్యాక్ వాటర్ కెరటాలు, అలలు.. ప్రశాంతమైన ప్రకృతి సోయగాలు.. పిల్లగాలికే పరవశించే ఆకుల సవ్వడులు.. నులువెచ్చని సూర్యోదయాలు.. సముద్రాల్లో లీనమయ్యే సంధ్యా సమయాలు.. ఇంతటి అద్భుతమైన ప్రకృతి దాచుకున్నది కేరళ.. అందుకే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ గా అందరి హృదయాల్లో నిలిచిపోయింది. కేరళ ఇండియాలో అద్భుతమైన ప్రకృతి సంపదను సంపాదించుకుంది. ఈ ప్రాంతం అనేక జలపాతాలు, పక్షుల కిలకిల రాగాలు, ప్రకృతి సోయగాలు అలరిస్తాయి.. ప్రపంచంలోనే భూతల స్వర్గం అంటూ ఏదైనా ఉంటే అది కేరళలోనే ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని జీవితంలో ఒక్కసారి అయినా చూడాలనేది అందరి కోరిక .కేరళకు వెళ్లేవారికి ముందుగా తాకేది అలపి. దీనిని ఆలపూజ అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్ వాటర్ ఉన్న ప్రాంతం అలపి.. ఈ బ్యాక్ వాటర్ కేరళ రాష్ట్రంలో సగానికి పైగా అక్రమించింది.
ఈ బ్యాక్ వాటర్ లో బోట్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రయాణిస్తాయి వీటిని కట్టు బెల్లం అంటారు బోట్ హౌసెస్ ఈ బ్యాక్ వాటర్ లో బోట్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయి వీటిని కట్టువెల్లం అని కూడా పిలుస్తారు. ఈ బోట్ హౌసెస్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఓవర్ నైట్ ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రయాణించే వారికి బోట్‌లోనే ఫుడ్ ను వండి పెడుతారు. రాత్రింబళ్లు ఓవర్ నైట్ బోట్‌లోనే ప్రయాణం చేస్తూ 24 గంటల పాటు నీటిపై తేలియాడుతూ ప్రయాణించవచ్చు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వారి వంటలను తింటూ ఎంతోఎంజాయ్ చేయవచ్చు. కేరళలో బోటింగ్ ప్రయాణం ఎక్కువగా చేయవచ్చు. ప్రకృతి రమణీయను చూసి మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పటి వరకూ ఉన్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు మనల్ని మైమరిపించేలా చేస్తాయి. ప్రకృతి అందాలను తనివి తీరా చూడచ్చు. బోట్‌లో ప్రయాణించేటప్పుడు మనకు ఎటు చూసినా కొబ్బరి చెట్లు కన్పిస్తాయి. దేశంలో 90 శాతం కొబ్బరికాయ సరఫరా కేరళ నుంచే సరఫరా అవుతుంది. 10శాతం మాత్రమే కోనసీమ నుంచి సరఫరా అవుతుంది.
కేరళలో సీ ఫుడ్ (సముద్రపు ఆహారం) ఎక్కువగా దొరుకుతుంది. ఇక్కడ తాజా సీ ఫుడ్ లభ్యమవుతుంది. ఇక్కడ సీ ఫుడ్‌ను తీసుకుంటే వాళ్లే మనకు వండిస్తారు. కేరళలో స్పెషల్ వంటకం అంటే కోకోనట్ రెడ్ చట్నీ. ఇది చాలా బాగుంటుంది. క్యాబేజీ, బీన్స్ కాంబినేషన్‌తో చేసే వంటకం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తయారు చేసే టమాటా పచ్చడి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా కేరళలో వెరైటీ టిఫిన్స్ కూడా రుచిగా ఉంటాయి. ఈ ప్రాంతంలో టూర్ కి వెళ్ళినప్పుడు వెరైటీ కొత్త టేస్ట్ వంటకాలు రుచి చూడవచ్చు. అలిపిలో దేవాలయాలు, చర్చిలు ఎక్కువగా ఉంటాయి. అలిపిలో ఉండే పెద్ద టెంపుల్ కృష్ణ ఆలయం ఉంటుంది. కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు. అందుకే ఇక్కడ ఎక్కడ చూసినా ఏనుగు బొమ్మలు కనిపిస్తాయి.