Tourist places India : స‌మ్మ‌ర్‌లో కూల్ అవ్వాల‌నుకుంటున్నారా.. బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..

Tourist places India : స‌మ్మ‌ర్‌లో కూల్ అవ్వాల‌నుకుంటున్నారా.. బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..

Tourist places India : వేసవి సెలవులు వచ్చేసాయి. సంవత్సరం అంతా పుస్తకాలకు అతుక్కు పోయిన పిల్లలు ఇప్పుడు ఫ్రీ బర్డ్స్ అయ్యారు. ఈ హర్ట్ సమ్మర్ లో కూల్ కూల్ ప్లేసెస్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉందా. అయితే మీ పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తూన్నారా. మరి మీరు కూడా ఈ సమ్మర్ లో ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్లాలని అనుకుంటున్నారా.

అయితే మీలాంటి వారి కోసమే ఇది. ఎక్కడికి వెళ్లాలి. ఏ టూరిస్ట్ ప్లేస్ కి వెళ్తే బాగుంటుంది. అనే టెన్షన్ ని వదిలేయండి. ఎందుకు అంటే సమ్మర్ లో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే కొన్ని ప్రదేశాల జాబితాలు మీ ముందుకు తీసుకువచ్చింది. అయితే ఆ ప్లేస్ లు ఉన్నవి ఎక్కడో కాదండి. మన ఇండియాలోనే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

సమ్మర్ లో చాలామంది వెళ్లే పర్యటక ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశంలోని మనాలి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన లోయలు, నదులు పర్యటకులను ఆకర్షించటంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడికి వెళ్లిన వారు అత్యంత పురాతనమైన హిడింబా దేవాలయం 3900 మీటర్ల ఎత్తులో ఉన్న రోహతాంగ్ పాస్ కచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది.

297 -2

అంతే ఫ్లారాగ్లెడింగ్, జిప్ లైనింగ్ లాంటి సాహస క్రీడలలో పాల్గొనాలనుకునేవారు సోలాం గ్ వ్యాలీని కూడా సందర్శించవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న లోకల్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ కూడా ఈ ట్రిప్ ను ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. అందమైన పర్యటక ప్రదేశాలలో వెస్ట్ బంగాల్ లోని డార్జిలింగ్ కూడా ఒకటి. ఇక్కడ అందమైన కొండల మధ్యలో ఉన్న టీ తోటలు పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

సమ్మర్ లో కనుక మీరు ఇక్కడికి వెళ్లినట్లయితే పచ్చని తేయాకు తోటల మధ్యలో కూర్చొని టీని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అంతే డార్జిలింగ్ లోని టైగర్ హిల్ ప్రాంతంలో సూర్యోదయాన్ని చూసేందుకు చాలామంది పర్యటకులు అక్కడికి వెళతారు. అంతే అత్యంత పురాతనమైన గూమ్ మొనాస్టరీ బౌద్ధ మఠాన్ని కూడా చూడవచ్చు.

మీరు ఇక్కడికి వెళ్ళినట్లయితే డార్జిలింగ్ నుండి గోమ్ వరకు వెళ్లే చిన్న రైలు ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ జర్నీ ని మీరు జీవితంలో మర్చిపోలేరు. అంత బాగుంటుంది మరి. అంతే సిక్కిం రాజధాని గాంగ్ టాక్ నగరం. ఇక్కడ మంచు దుప్పటి కప్పుతున్న పర్వతాలు, అందమైన కొండల మధ్యలో నుండి జారుతున్న సెలయేర్లు పర్యటకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి.

297 -3

అంతే ఇక్కడ ఉన్న పురాతమైన బౌద్ధ మఠాలు మనల్ని ఆధ్యాత్మిక భావనలోకి తీసుకుపోతాయి. ఇక్కడికి వెళ్లినట్లయితే మీరు హనుమాన్ టోక్ కి ట్రెక్కింగ్ కు కచ్చితంగా వెళ్లండి. ఎందుకు అంటే ఇక్కడ నుండి కాంచన్ జంగా పర్వతం అందాలు చూడవచ్చు. అంతే లోకల్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ సాంప్రదాయ సిక్కిం వంటకాలను కూడా మీరు ఆస్వాదించవచ్చు...

మున్నార్ అనేది కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైన పర్వతం ఇది. ఇక్కడ ఎటు చూసినా గాని విశాలమైన టీ తోటలు, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. మీరు మున్నార్ కు వెళ్ళినట్లయితే ఎరవికులం నేషనల్ పార్కును కచ్చితంగా చూడవచ్చు. దీనిలో నీలకరింజీ, ఆసియాటిక్ ఏనుగులతో పాటుగా అంతరించిపోతున్న ఇతర రకాల వన్యప్రాణులను కూడా మీరు చూడవచ్చు.

అంతే ట్రెక్కింగ్,బోటింగ్ చేయాలి అని అనుకునే వారు కూడా ముట్టు పెట్టి డ్యామ్ ను కూడా చూడవచ్చు. అంతేకాక సీతా కుండం వద్ద కూడా ట్రెక్కింగ్, క్యాంపింగ్ చేయవచ్చు. అలాగే లేహ్ లో ఎత్తైన మంచు పర్వతాలు, మధ్యలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలు, అందమైన సరస్సులు, కొలువుదీరిన ప్రాంతాలు పర్యటకులను చూపు తిప్పుకొనియ్యవు.

297 -4

17వ శతాబ్దంలో నిర్మించినటువంటి లద్దక్ రాజులు నివసించిన భవనం లేహ్ ప్యాలెస్ ఇక్కడ పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతేకాక ట్రైకింగ్  చేయాలి అనుకునే వారికి కూడా లేహ్ ఒక స్వర్గధామంగా చెబుతూ ఉంటారు. ఎందుకు అనగా ఇక్కడ న్యూ బ్రా వ్యాలీ, ట్రాన్స్ జిమ్ క్వాల్ ట్రేక్, చాంగ్ తాక్ ట్రేక్ లాంటి వివిధ ప్రాంతాలలో కూడా మీరు ట్రెక్కింగ్ చేయవచ్చు.

ఇక మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ హిల్స్, పాంగాంగ్ సరస్సును కూడా సదర్శించవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్ర వ్యాలీ జిల్లాలో మెక్ లియోడ్ గంజ్ పట్టణం ఉంటుంది. ఇది డిబేటీయన్ వలస రాజులకు నివాస నిలయంగా చెబుతారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కచ్చితంగా చూడవలసిన ప్రదేశాలలో దలైలామా ఆలయాన్ని టిబేట్  మ్యూజియం కూడా ఉన్నాయి.

దలైలామా ఆలయాన్ని సందర్శిస్తే బౌద్ధ మాత ఆచారాలు, విశ్వాసాలు, చరిత్ర లాంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అంతేకాక టిబెట్ ప్రజల సంస్కృతి గురించి తెలుసుకునేందుకు టిబెట్ మ్యూజియం కూడా మీరు చూడవచ్చు. ఇంకా చుట్టుపక్కల ఎన్నో ట్రెక్కింగ్ ట్రయల్స్ కూడా ఉన్నాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?