Valmiki Caves : అత్యంత పొడవైన భూ అంతర్భాగంలో ఉన్న గుహలు.. వీటిని చూస్తే మతి పోవాల్సిందే..

Valmiki Caves : అత్యంత పొడవైన భూ అంతర్భాగంలో ఉన్న గుహలు.. వీటిని చూస్తే మతి పోవాల్సిందే..

Valmiki Caves :  పూర్వం ఈ గుహలలో వాల్మీకి మహర్షి పర్యటించారు అందుకే వీటిని వాల్మీకి గుహలు అని పిలుస్తారని తెలిపారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగాను మరొకవైపు పర్యాటక కేంద్రంగాను పర్యటకులను ఎంతో ఆకర్షించుకునేలా అద్భుతమైన ఆలయ కట్టడాలు మరియు రాజులు పరిపాలించిన ప్రాంతాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.

అయితే పూర్వం కర్నూల్ జిల్లాలో మరియు ప్రస్తుతం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో కూడా వీటిని చూడవచ్చు. ఇప్పుడు ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఉన్న ఇలాంటి పురాతనమైన వాటిలలో మరొకటి వచ్చి చేరింది. అదే వాల్మీకి గుహలు. ఉమ్మడి కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గం లోని బోయవాండ్లపల్లి గ్రామం దగ్గరలో ఈ వాల్మీకి గుహలను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కనుక్కున్నారు.

ఈ గుహలను మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ అధికారుల ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేయటం జరిగింది.. ప్రపంచంలో అత్యంత పొడవైన భూ అంతర్భాగంలో ఉన్న స్వరంగ మార్గాలలో ఉండే గుహలు కూడా ఉమ్మడి కర్పూల్ జిల్లాకే సొంతం అయ్యాయి.

159 -3

ప్రపంచంలోనే అత్యంత పొడవైన భూ అంతర్భాగంలో ఉండే సొరంగా మార్గంలో ఉన్నటువంటి వాటిలలో ఒకటి మేఘాలయ గృహాలు మరియు ఆ తర్వాత బుర్ర గుహలు ఒకటైతే. మూడవది ఈ ఉమ్మడి కర్నూల్ జిల్లా బనగానపల్లె నియోజకవర్గం లోని కొలిమిగుంట్ల దగ్గరలో ఉన్న బెలుం గుహలు ఒకటి. వైజాగ్ లో ఉండే బొర్ర గుహల కంటే కూడా ఇవి చాలా పెద్దవి అని కూడా అంటున్నారు.

సుమారుగా ఈ అంతర్భాగము ఒక కిలోమీటర్ వరకు ఈ స్వరంగా మార్గం ఉండటం వలన పర్యటకులు సందర్శించేందుకు వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ చౌరవతో సుమారు మూడు కోట్ల ప్రభుత్వా నిధులతో ఆధునికరించారు.

బోయవాండ్లపల్లి గ్రామంలో ప్రకృతి వలన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ గుహలను వాల్మీకి గుహలుగా అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.. పూర్వం ఇక్కడ ఈ గుహలలో వాల్మీకి మహర్షి పర్యటించారు  కాబట్టి వీటిని వాల్మీకి గుహలు అని అంటారని తెలిపారు.

159 -2

ఈ గుహలకు కర్నూల్ జిల్లా కేంద్రం నుండి రోడ్డు మార్గంలో 52 కిలోమీటర్లు ఉన్న పట్టణానికి చేరుకొని అక్కడ ఉన్న డోర్ నుండి రోడ్డు మార్గంలో 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోయివాండ్లపల్లికి చేరుకొని అక్కడి నుండి నల్లమేకల పల్లె గ్రామం చేరుతారు.

మళ్ళీ అక్కడి నుండి కేవలం ఒక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాల్మీకి గుహల దగ్గరకు చేరవచ్చు. రాయలసీమ రత్నాలసీమ. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గొడవలు మరియు రాజకీయాలు, ఘాటెక్కించే మసాలా వంటకాలు ఇవే మనకు ముందు గుర్తుకు వస్తాయి.

కానీ రాయలసీమలో ఉండే పర్యటక ప్రదేశాలు చూస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్ముతాయి అంటే నమ్మరు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఉండే ఈ పర్యాటక ప్రదేశాలకు ఒక ప్రత్యేకత అనేది ఉన్నది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?