Weekend Tour Package : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి..

Weekend Tour Package : వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి..

Weekend Tour Package : ప్రస్తుతం పిల్లలకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. దీనితో చాలామంది టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ వాసులు వీకెండ్ వస్తే ఎక్కడికైనా వెళ్లి కుటుంబంతో లేక స్నేహితులతో కాస్త ప్రశాంతంగా గడపాలని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దీనికోసం ఇంటర్నెట్లో ఎక్కడికి వెళ్లాలా అని కూడా తెగ వెతికేస్తారు.

అలాంటి వారి కోసమే ఈ సమాచారం. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని  ఆసక్తికరమైన ప్రదేశాల కు మేము తీసుకెళ్తున్నాం. వాటి గురించి తెలుసుకొని రాబోయే వీకెండ్స్ లో వెళ్లడానికి ప్లాన్ చేసుకోండి.  ఇవి కేవలం ఒక్క రోజుల్లో తేలిగ్గా వెళ్లి తిరిగి రాగల పర్యటక ప్రదేశాలు. కావున ఉద్యోగాలు చేసేవారు చాలామంది

ఎక్కువ రోజులు కేటాయించలేని పరిస్థితి కాబట్టి. అలాంటి వారి కోసమే ఈ తెలంగాణ టూరిజం ఒక మంచి టూర్ ప్యాకేజీలు తీసుకువచ్చింది. కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగిసేలా ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏ ఏ ప్రాంతాలు కవర్ అవుతాయో, వాటి ధరలు ఎలా ఉన్నాయో, లాంటి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం...

153 -2

ప్రతి శనివారం కూడా ఈ టూర్ ను ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ కొండపోచమ్మ, వేములవాడ, కొండగట్టు, హైదరాబాద్ పేరుతో ఈ టూర్ ను ఆపరేట్ చేయనున్నారు. ఏసీ మరియుమినీ బస్సులో ప్రయాణం అనేది ఉంటుంది. ఇక ధర విషయాలకు వస్తే పెద్దలకు మాత్రం ఒక్కొక్కరికి రూ.1799 ఉండగా చిన్నారులకు మాత్రం రూ.1439గా నిర్ణయించడం జరిగింది.

దర్శనం మరియు ఎంట్రీ టికెట్స్, ఫుడ్ ఇవన్నీ కూడా ప్యాకేజీలో కవర్ అవుతాయి. టూర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


ఉదయం 6 గంటలకు బషీర్ బాగ్ లోని సీఆర్ ఓ కార్యాలయం నుండి బస్సు బయలుదేరుతుంది. ఉదయం 9 గంటలకు కొండ పోచమ్మ రిజర్వాయర్ కు మీరు చేరతారు. మార్గం మధ్యలోనే బ్రేక్ ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటలకు కొండ పోచమ్మ రిజర్వాయర్ నుండి మీరు బయలుదేరుతారు. అనంతరం 11:00 గంటల తరువాత కొమర వెళ్లి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గుడిలో మీరు దర్శనం చేసుకుంటారు.

153 -4

అక్కడ దర్శనం చేసుకున్న తరువాత వేములవాడకు మీరు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో వేములవాడకు చేరతారు. మధ్యాహ్నం 2:00 గంటల నుండి 4:00 గంటల వరకు దర్శనం లంచ్ అనేది ఉంటుంది. దాని తరువాత సాయంత్రం 4:00 గంటలకు వేములవాడ నుండి బయలుదేరుతారు. తిరిగి సాయంత్రం 5:00 గంటలకు కొండగట్టు చేరతారు.

తరువాత 6:00 గంటల వరకు దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరిగి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10 గంటల టైమ్ లో మీరు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక్క రోజుల్లో ముగుస్తుంది కాబట్టి. మీరు కూడా టికెట్ బుక్ చేసుకొని  వీకెండ్ టూర్ ను ఎంజాయ్ చేయండి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?