Oscar Awards 2024 : "ఓపెన్ హైమ‌ర్" కు ఆస్కార్ పుర‌స్కారాల పంట‌

Oscar Awards 2024 :

Oscar Awards 2024 : ఆస్కార్ అవార్డ్స్ 2024 ప్రదానోత్సవ వేడుక‌లు లాస్ ఏంజిల్స్ థియేట‌ర్‌లోని డాల్పీ థియేట‌ర్‌లో  అంగరంగ వైభవంగా కొనసాగాయి. 96వ ఆస్కార్ అవార్డుల్లో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు గాని, సినిమాలకు గాని ఈ ఏడాది పురస్కారాలు దక్కలేదు. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే "ఓపెన్ హైమ‌ర్"  సినిమాకు ప్ర‌ధాన విభాగాల్లో  7 అవార్డులు దక్కాయి. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోల‌న్‌ తెరకెక్కించిన  ఈ సినిమా  ఆస్కార్ అవార్డుల్లో స‌త్తా చాటింది. ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు స‌హా ప‌లు పుర‌స్కారాల‌ను ద‌క్కించుకుని వారెవ్వా.. అనిపించుకుంది. ఈ సారి ఆస్కార్ అవార్డుల్లో "పూర్ థింగ్స్" సినిమా కూడా 4 పుర‌స్కారాల‌ను త‌గ్గించుకుని త‌న మార్కు చాటుకుంది.
  
ఆస్కార్ అవార్డులు ఇలా..
ఉత్తమ చిత్రం :- ఓపెన్ హైమర్
ఉత్తమ దర్శకుడు :- క్రిస్టోఫర్ నోలన్ - (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటుడు :- కిలియన్ మర్ఫీ - (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి :- ఎమ్మాస్టోన్ - (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటుడు :- రాబర్డ్ డౌనీ జూనియర్ -(ఓపెన్ హైమర్)
ఉత్తమ సహాయ నటి :- డ్వేన్ జో రాండాల్ఫ్ - (ది హోల్డోవర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ :- ఓపెన్ హైమర్ - (హోయటే, హోయటేమ)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే :- జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ప్లే :- కార్డ్ జెఫర్పన్ (అమెరికన్ ఫిక్షన్)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ :- వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ - (బార్బీ)
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ :- 20 డేస్ ఇన్ మరియూపోల్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ :- హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ :- ది బాయ్ అండ్ ది హిరాన్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ :- ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ :- గాడ్జిల్లా మైనస్ వన్ - (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ :- జేమ్స్ ప్రైస్, షోనా హెత్ - (పూర్ థింగ్స్)
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ :- నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ -(పూర్ థింగ్స్)
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ :- ఓపెన్ హైమర్ - (జెన్నీఫర్ లేమ్)
బెస్ట్ సౌండ్ :- ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం :- ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం :- ద లాస్ట్ రిపేర్ షాప్ - (బెన్ ఫ్రొడ్ఫుట్, క్రిస్ బ్రోవర్స్)
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం :- వార్ ఈజ్ ఓవర్

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?