Gutta Sukhender Reddy: కేసీఆర్ హ‌యాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ‌

తెలంగాణ  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutta Sukhender Reddy: కేసీఆర్ హ‌యాంలో రికార్డు స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ‌

నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 27 (క్విక్ టుడే) : గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అల్ టైమ్ అత్యధిక  రికార్డ్ స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింద‌ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండలోని గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప‌దేండ్లుగా అత్యధిక వర్షపాతం నమోదు కావ‌డంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, జలకళ తో నిండు కుండల్లా కనిపించాయ‌న్నారు.  దీంతో పంటలు సంవృద్ధిగా పండిన‌ట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు  దురదృష్టవశాత్తు వర్షాలు లేక‌పోవ‌డంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయ‌న్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయ‌ని, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీరులేకపోవడంతో ఆయకట్టు కింద క్రాఫ్ హాలిడేలు ప్రకటించార‌ని అన్నారు. ప్రస్తుతానికి అన్నదాతలు బోర్లు, బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. భూగర్భ జలలు అడుగంటి బావులు ఎండిపోయాయ‌ని, పొట్ట దశలో ఉన్న పంటలు అన్ని ఎండిపోతున్నాయ‌ని అన్నారు.

కర్ణాటక  రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కావున తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే 15 నుండి 20 టీఎంసిల నీటిని  తీసుకువచ్చి, ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని కోరారు. కనీసం ఒక్క తడికైనా నీటిని అందించాలని ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశారు. మార్చి తర్వాత తెలంగాణలో మంచి నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉంద‌ని, రాష్ట్ర ప్రభుత్వం ముంద‌స్తు చర్యలు చేపట్టాల‌ని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ  అధిష్టానం  ఎవరికీ పార్టీ టికెట్ ఇచ్చిన వారికి సహకరిస్తామ‌న్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమ‌ని, సమన్వయంతో పని చేస్తే ఫలితాలు వ‌స్తాయ‌న్నారు. త‌న కుమారుడు న‌ల్ల‌గొండ లేదా భువనగిరి నుంచి ఎక్క‌డి నుంచి టికెట్ ఇచ్చినా పోటీ చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు. 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?