అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా..

- బీజేపి నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి 

అధిష్టానంపై నమ్మకంతో పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నా..

నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 23 (క్విక్ టుడే) : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంద‌ని, అధిష్టానంపై పూర్తి నమ్మకంతో న‌ల్ల‌గొండ‌ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నాన‌ని  బీజేపీ నాయకులు తుక్కాని మన్మధ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో రామా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ  బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలతో ప్రజలందరూ మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆయుష్మాన్ భారత్ పథకంలో ఐదు లక్షల నుండి 10 లక్షల వరకు పెంచిన ఘ‌న‌త నరేంద్ర మోడీ దని తెలిపారు. 
సబ్కా సాత్ ,సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్..
అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. ఐదు వందల సంవత్సరాల హిందువుల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాల రాముని ప్రాణప్రతిష్ట నరేంద్ర మోడీ  ప్రభుత్వంలో జరగడం గొప్ప విశేషమని , నరేంద్ర మోడీ కారణజన్ముడు అని, దైవ స్వరూపుడు అని నరేంద్ర మోడీ ని మన్మధ రెడ్డి కొనియాడారు. న‌ల్లగొండ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న మన్మధ రెడ్డి విద్యారంగంలో అనేకమంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందించిన ఘనత మన్మధ రెడ్డి ది ఆని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం నా మీద నమ్మకంతో నాకు ఒక అవకాశం కల్పిస్తే అన్ని వర్గాల ప్రజల మద్దతుతో ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బూర మల్సూర్ గౌడ్, న‌ల్ల‌గొండ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, ఫణి నాయుడు, రాపర్తి హరిప్రసాద్, పెనుగొండ రవివర్మ
సందీప్ గౌడ్, చిలువేరు మనోహర్, జల్లి గణేష్, నారాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?