Dandempalli Sattaiah : రైతు మ‌ర‌ణానికి మోదీ ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య 

Dandempalli Sattaiah : రైతు మ‌ర‌ణానికి మోదీ ప్రభుత్వం బాధ్య‌త వ‌హించాలి

Dandempalli Sattaiah : నల్లగొండ జిల్లా ప్రతినిధి. ఫిబ్రవరి 22.(క్విక్ టుడే ) : కనీస మద్దతు ధర చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసుల దాడిలో శుభ కరణ్ సింగ్ అనే రైతు మరణానికి బీజేపీ బాధ్యత వహించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులపై పోలీసుల దాడిని ప్రజాస్వామ్యవాదులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల సమస్యలను పరిష్కరించలేని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దాడి చేసి రైతులను చంపడం దుర్మార్గ చర్య అని అన్నారు. ఫిబ్రవరి 21న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టిన రైతాంగం పై పంజాబ్, హర్యానా సరిహద్దు.ఖీ నౌరి. వద్దా రైతాంగం పై పోలీసు యంత్రాంగం జరిపిన పాశావిక దాడులలో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి సంతానం సంతాపాన్ని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం గతంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతంగంపై కాల్పులు జరిపి రైతులను పొట్టన పెట్టుకున్న బిజెపి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

పోలీసు  కాల్పుల్లో మరణించిన శుభ కరణ్ సింగ్ కుటుంబానికి రూ.50 లక్షలు,  పోలీసు కాల్పుల్లో క్షేత్రగాత్రులైన రైతు కుటుంబాలకు  రూ.20 లక్షల  ఆర్థిక  సహాయం కేంద్ర ప్రభుత్వం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులపై కాల్పులు జరిపిన పోలీసులను తక్షణమే గుర్తించి వారిని ఉద్యోగం నుండి తొలగించవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉందని అన్నారు. రైతాంగానికి మద్దతుగా కార్మిక వర్గం కార్మిక కర్షక మైత్రితో కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన కాల్పులను నిరసిస్తూ ఫిబ్రవరి 23 బ్లాక్  డే  నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపాలని నిర్ణయించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా కార్మికులకు నిరసనలు తెలియజేయాలని కోరారు

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?