Nalgonda : హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
పట్టణంలో సీఐటీయూ బైక్ ర్యాలీ
Nalgonda : ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలలో ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు
శుక్రవారం దేశవ్యాపిత కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ఎఫ్సీఐ , బేవరేజెస్, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీలు పట్టణంలో కలెక్టరేట్ నుండి బిటిఎస్, ప్రకాశం బజార్, మైసయ్య సర్కిల్ నుండి పెదగడియారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు .
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ 1996 సంక్షేమ చట్టం1976 వలస కార్మికుల సంక్షేమ చట్టాలను రద్దు చేస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న అమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా పెన్షన్ సౌకర్యం కల్పించే విధంగా హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వమే గుర్తింపు కార్డులు పని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు
ఈ ర్యాలీలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు అవురేషు మారయ్య కాడింగ్ రవికుమార్, బేవరేజెస్ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చల్ల యాదయ్య కార్యదర్శి లొడంగి ఉపేందర్ ఎఫ్సీఐ అమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పల్లె నగేష్ కోశాధికారి వట్టిపల్లి వెంకన్న నకేరేకంటి సత్తయ్య, శ్రీనివాస్, పాండు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు