Nalgonda : మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలి
కమిషనర్ కు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సమ్మె నోటీసు
పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా పెద్దపెద్ద కంపెనీల పరం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము కంపెనీల పరం అవుతుందని అన్నారు. 11వ పిఆర్సి చైర్మన్ సిఫారసుల చేసిన వేతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం 19,000 ,22,500 ,31,000 కేటగిరీల వారిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని దహన సంస్కారాలకు రూ.30 వేలు ఇవ్వాలని కోరారు. ఆదివారాలు పండగ సెలవులు ఎనిమిది అమలు చేయాలని, వాటర్ వర్క్స్ విభాగంలో కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం, ఐ ఎన్ టి యూ సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మోహినోద్దీన్ , సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐ ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు అవుట రవీందర్, మున్సిపల్ జిల్లా కార్యదర్శి సుంకిశాల వెంకన్న, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, జె ఏ సి నాయకులు పందుల లింగయ్య, సంతోష్, ఎండి లతీఫ్, మాదారం భాస్కర్, ఏ శ్రీదేవి, కె.ధనమ్మ, జి జానమ్మ, పెరిక కళ్యాణ్, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.