బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం
On
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి 200వ వారం పూలమాల అలంకార కార్యక్రమం నాచారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పుల నర్సింగ్ రావు, ఏర్పుల చిన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడల మల్లికార్జున గౌడ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీహరి, శ్రీరాములు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, బండారి రఘు, రాజు, రమేష్, రాకేష్, హరీష్, బి రాకేష్, రెబల్ రాజు, జగదీష్, సురేష్, పరశురాం, స్వామి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...